Nandamuri Balakrishna: యోగా దినోత్సవ వేడుకల్లో నందమూరి బాలకృష్ణ యోగాసనాలు...

టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.  హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన యోగా వేడుకలకు ఆయన హాజరయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 21, 2022, 01:06 PM IST
  • ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం
  • బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో యోగా వేడుకలు
  • పాల్గొన్న నటుడు నందమూరి బాలకృష్ణ
Nandamuri Balakrishna: యోగా దినోత్సవ వేడుకల్లో నందమూరి బాలకృష్ణ యోగాసనాలు...

International Yoga Day 2022: టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన యోగా వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  దేశ ప్రజలందరికీ 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆనాటి గ్రంథాలు, రుషులు అందించిన యోగాసనాలు ఎంతో గొప్పవని బాలకృష్ణ పేర్కొన్నారు. 15 దేశాలతో మొదలైన యోగా ఇప్పుడు 175 దేశాలకు విస్తరించిందన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగాకు ప్రాధాన్యతనిస్తున్నాయని అన్నారు. ప్రతీ ఒక్కరూ నిత్యం యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారం ఎంతో ప్రయోజనకరమైనదని.. లక్ష్య సిద్ధి ప్రజలు ఆ మార్గాన్ని అనుసరించాలని అన్నారు. బాలకృష్ణ యోగాసనాల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

కాగా, ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (జూన్ 21) ఉదయం కర్ణాటకలోని మైసూరులో జరిగిన యోగా వేడుకల్లో పాల్గొని యోగాసనాలు వేశారు. యోగ అంటే జీవితంలో ఒక భాగం కాదని.. యోగా జీవన మార్గమని అన్నారు. యోగాతో విశ్వ శాంతి నెలకొంటుందని అన్నారు.
 

Also Read: Hyderabad Pub: పబ్ లో యువతి పై దాడి.. గ్యాంగ్ రేప్ చేస్తామని వార్నింగ్! హైదరాబాద్ లో మరో కిరాతకం..  

Also Read: Agniveer Notification 2022: అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవిగో..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News