Atmakur Bypoll: ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతోంది. మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఆత్మకూరు బైపోల్ అనివార్యమైంది. నామినేషన్లు కూడా కొనసాగుతున్నాయి. ఉప ఎన్నికలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేకపాటి కుటుంబం నుంచే గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇప్పటికే విక్రమ్ రెడ్డి నియోజకవర్గంలో తిరుగుతున్నారు.గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చాలా గ్రామాలు చుట్టేశారు. ఆత్మకూరు ఉపఎన్నికలో పోటీ చేస్తామని ప్రకటించింది బీజేపీ. అయితే ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి మేనల్లుడు, ఆ ఫ్యామిలీకి మొదటి నుంచి ప్రత్యర్థిగా ఉన్న బిజివేముల రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తారని తెలుస్తోంది.
ఆత్మకూరు పోటీ విషయంలో జనసేన ఇంకా తన స్టాండ్ చెప్పలేదు. కడప జిల్లా బద్వేలు సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు ... కుటంబసభ్యులకే టిక్కెట్ ఇవ్వడంతో తాము పోటీ చేయబోవడం లేదని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆత్మకూరులోనే మేకపాటి ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్నందున.. జనసేన పోటీ చేసే అవకాశం లేదంటున్నారు. అయితే బీజేపీకి మద్దతు ఇస్తుందా లేదా అన్నది క్లారిటీ లేదు. ఆత్మకూరు ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది టీడీపీ. మేకపాటి కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇచ్చినందున.. గత సంప్రదాయాన్ని పాటించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ నేతలు చెప్పారు. గత సంప్రదాయం పాటించే ఆత్మకూరు ఉపఎన్నికలో పోటీకి దూరంగా ఉంటున్నామని టీడీపీ చెబుతున్నప్పటికీ.. దీని వెనుక ఆ పార్టీకి పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది.
ఏపీలో కొన్నిరోజులుగా పొత్తులపై జోరుగా చర్చ సాగుతోంది. ఏపీలో ప్రస్తుతం బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామని పవన్ కల్యాణ్ చెప్పడం సంచలనమైంది. చంద్రబాబు కూడా పవన్ వ్యాఖ్యలను బలపరిచేలా మాట్లాడటంతో పొత్తులు ఖాయమని తెలుస్తోంది. అయితే 2014 మాదిరే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా లేక టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందా అన్నది తేలడం లేదు. టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ తేల్చడం లేదు. కూటమి కోసం బీజేపీని ఒప్పించే ప్రయత్నాల్లో పవన్ కల్యాణ్ ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆత్మకూరు ఉప ఎన్నికను పొత్తులకు అనుకూలంగా మార్చుకోవాలని టీడీపీ ప్లాన్ చేసిందని తెలుస్తోంది.
ఆత్మకూరులో వైసీపీ బలంగా ఉంది. గౌతమ్ రెడ్డి చనిపోవడంతో ఆ కుటుంబంపై సానుభూతి ఉంది. ఆత్మకూరులో వైసీపీ గెలవడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేయడం వేస్ట్ అని టీడీపీ నేతలు భావించారని సమాచారం. బీజేపీ పోటీలో ఉన్నందున.. తాము పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైసీపీకి మెజార్టీ పెరిగే అవకాశం ఉంటుంది. మెజార్గీ భారీగా వస్తే వైసీపీకి బూస్త్ వస్తుంది. అందుకే పోటీ చేయకుండా బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇవ్వాలని టీడీపీ డిసైడ్ అయిందంటున్నారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట మొత్తం బీజేపీకి వెళ్లనుంది. ఉపఎన్నికలో బీజేపీకి గణనీయమైన ఓట్లు వస్తే.. దీన్ని సాకుగా చూపి పొత్తు కోసం ఆ పార్టీ హైకమాండ్ తో చర్చలు జరపవచ్చన్నది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. మొత్తంగా తమకు ఏ మాత్రం గెలిచే అవకాశం లేని ఆత్మకూరులో పోటీ చేయకుండా పరువు కాపాడుకోవడంతో పాటు బీజేపీకి పరోక్షంగా సహకరించి.. తాము కోరుకుంటున్న మహా కూటమి దిశగా అడుగులు వేయాలని చందన్న ప్లాన్ చేశారని అంటున్నారు. టీడీపీ ఆత్మకూరు వ్యూహం వెనుక పవన్ కల్యాణ్ కూడా ఉన్నారనే టాక్ రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.
READ ALSO:POWER PROJECT: సీఎం కేసీఆర్ నుంచి ప్రధాని మోడీ కమీషన్ తీసుకుంటున్నారా?
READ ALSO: Chandrababu On Konaseema: కోనసీమను కశ్మీర్ లా మార్చేశారు.. ఇంటర్ నెట్ నిలిపివేత దారుణమన్న చంద్రబాబు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Atmakur Bypoll: ఆత్మకూరు బైపోల్ కు టీడీపీ దూరం.. బీజేపీ కోసమేనా.. పొత్తుకు ముందస్తు వ్యూహమా?
ఆత్మకూరు బైపోల్ కు టీడీపీ దూరం
బీజేపీకి టీడీపీ పరోక్ష మద్దతు!
మహాకూటమి దిశగా బాబు స్కెచ్