Hyderabad Drugs Case: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు బయటకు రావడంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. నిహారిక విషయంలో అనవసర ఊహాగానాలు ప్రచారం చేయొద్దని... నిహారిక వైపు నుంచి ఎటువంటి తప్పు లేదని నాగబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు నాగబాబు సోషల్ మీడియా ద్వారా వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
'డ్రగ్స్ కేసుపై నేను స్పందించడానికి గల కారణం... పబ్‌పై దాడులు జరిగిన సమయంలో నా కూతురు నిహారిక అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ యాజమాన్యంపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంతవరకు ఆమె చాలా క్లియర్. ఇక్కడ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు నిహారిక విషయంలో ఎటువంటి తప్పు లేదు. సోషల్ మీడియాలో, ప్రధాన స్రవంతి మీడియాలో అనవసర ఊహాగానాలు ప్రచారం చేయొద్దని ఈ వీడియో రిలీజ్ చేస్తున్నా. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. అనవసర ఊహాగానాలు ప్రచారం చేయొద్దు.' అని నాగబాబు విజ్ఞప్తి చేశారు.
బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఉన్న ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌పై గత రాత్రి పోలీసులు జరిపిన దాడుల్లో 150 మంది పట్టుబడిన సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ సమాచారంతో పోలీసులు దాడులు చేయగా పలువురు సినీ, రాజకీయ, వీవీఐపీల పిల్లలు కూడా పట్టుబడ్డారు. ఇందులో మెగా డాటర్ నిహారిక పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అరవింద్ తదితరుల పేర్లు బయటకొచ్చాయి. బడా బాబుల పిల్లలంతా ఫుడింగ్ పబ్‌కి చేరి రేవ్ పార్టీ పేరిట డ్రగ్స్ మత్తులో రచ్చ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Hyderabad: సంచలనం రేపుతోన్న డ్రగ్స్ కేసు.. తన కొడుకుపై వస్తున్న ఆరోపణలపై మాజీ ఎంపీ రియాక్షన్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook