Pujab Polls Result 2022: పంజాబ్‌ ఎన్నికల్లో సోనూసూద్‌ సోదరి మాళవిక సూద్‌ ఓటమి

Pujab Election Result 2022: పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో సోనూసూద్​ సోదరి మాళవికా సూద్ ఓడిపోయారు. ఆప్​ అభ్యర్థి అమన్​దీప్​ కౌర్​ చేతిలో ఓటమి పాలయ్యారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2022, 03:04 PM IST
Pujab Polls Result 2022: పంజాబ్‌ ఎన్నికల్లో సోనూసూద్‌ సోదరి మాళవిక సూద్‌ ఓటమి

Pujab Election Result 2022: పంజాబ్‌ ఎన్నికల్లో ఆప్‌ క్లీన్‌స్వీప్‌ దిశగా సాగుతోంది. 117 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Pujab Assembly Elections 2022) ఆమ్‌ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ఇప్పటికే 92 స్థానాల్లో గెలుపొందింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓటమిని చవిచూస్తోంది. కేవలం కాంగ్రెస్ 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.  కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ సోదరి మాళవిక సూద్‌ (malavika sood)...ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్‌దీప్ కౌర్ అరోరా చేతిలో ఓటమి చెందారు. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మోగ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోయారు. 1977 నుంచి 2017 వరకూ ఆ పార్టీ ఇక్కడ ఆరుసార్లు నెగ్గింది. 

ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌లో పంజాబ్ ఫలితాలు హేమాహేమీలకు షాకిచ్చాయి. అధికార కాంగ్రెస్, స్థానికంగా ప్రజాదరణ ఉన్న శిరోమణి అకాళీదళ్, కమలం పార్టీకి షాక్ ఇచ్చింది చీపురు పార్టీ. పంజాబ్‌లో ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తుంది. పంజాబ్ హస్తం పార్టీలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ..ముఖ్యమంత్రి చరణ్‌సింగ్ చన్నీల మధ్య విభేదాలు తలెత్తిన చివరి క్షణంలో వారు పక్కన పెట్టి బరిలో నిలిచారు. ఇద్దరు నేతలు ఐక్యమత్యంగా ఉన్న సక్సెస్ కాలేదు. కాంగ్రెస్ (Congress) అంతర్గత రాజకీయాలతో విసిగిపోయిన పంజాబ్ ప్రజలు అప్‌కే పట్టం కట్టారు. ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి ఆమ్‌ఆద్మీ అతి పెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. 

Also Read: Pujab Election Result 2022: మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటమి.. ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook   

 

Trending News