Mithali Raj: భరతనాట్యం నుంచి క్రికెట్ వరకూ సాగిన మిథాలీ రాజ్ కెరీర్

టీమ్ ఇండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కెరీర్ ఆసక్తికరంగా సాగింది. 1982 డిసెంబర్ 3న రాజస్థాన్‌లో  జన్మించిన మిథాలీ రాజ్..ఒకప్పుడు భరతనాట్యంలో ప్రావీణ్యురాలు. నాట్యమంటే పిచ్చి కూడా. వన్డే ఇంటర్నేషనల్‌లో 1999లో ఎంట్రీ ఇచ్చిన మిథాలీ రాజ్..తొలి మ్యాచ్‌లోనే 114 పరుగులు సాధించింది. 2001-2002లో ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఆమె గురించి మరిన్ని విశేషాలు...

Mithali Raj: టీమ్ ఇండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కెరీర్ ఆసక్తికరంగా సాగింది. 1982 డిసెంబర్ 3న రాజస్థాన్‌లో  జన్మించిన మిథాలీ రాజ్..ఒకప్పుడు భరతనాట్యంలో ప్రావీణ్యురాలు. నాట్యమంటే పిచ్చి కూడా. వన్డే ఇంటర్నేషనల్‌లో 1999లో ఎంట్రీ ఇచ్చిన మిథాలీ రాజ్..తొలి మ్యాచ్‌లోనే 114 పరుగులు సాధించింది. 2001-2002లో ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఆమె గురించి మరిన్ని విశేషాలు...
 

1 /5

మిథాలీ రాజ్ 1982 డిసెంబర్ 3న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించింది. భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. క్రికెట్‌లో ఎంట్రీ కాకపోయుంటే..భరతనాట్యంలో ప్రావీణ్యురాలై ఉండేది. 

2 /5

మిథాలీ రాజ్..2005లో జరిగిన మహిళా ప్రపంచ కప్ క్రికెట్‌లో కెప్టెన్‌గా ఉంది. 2010, 2011, 2012లో వరుసగా ఐసీసీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉంది.

3 /5

మిథాలీ రాజ్ నేతృత్వంలో టీమ్ ఇండియా విమెన్ క్రికెట్ జట్టు టాంటన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో గెల్చుకుంది. ఇంగ్లండ్‌ను సొంత గడ్డపై ఓడించిన ఘనత దక్కింది. 

4 /5

మిథాలీ రాజ్ తండ్రి ధీరజ్ బ్యాంకు ఉద్యోగి. మాజీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి. తండ్రి స్వతహాగా క్రికెటర్.  మిథాలీను ప్రోత్సహించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు తల్లిదండ్రులు. మిథాలీ పర్యటన ఖర్చుల కోసం సొంత ఖర్చులు తగ్గించుకుంటూ వచ్చారు. 

5 /5

209 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు చెందిన కరేన్ బోల్టన్ రికార్డ్‌ను బద్దలుగొట్టింది మిథాలీ రాజ్. మహిళా ప్రపంచకప్ 2005లో టీమ్ ఇండియా విమెన్ టీమ్ కెప్టెన్‌గా ఉంది. 2010, 2011, 2012లో ఐసీసీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించింది.