Helicopter services in Medaram Jatara: మేడారం జాతరకు వెళ్లాలనుకునే భక్తులకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. సరదాగా గాల్లో చక్కెర్లు కొట్టాలని ఆశపడేవారి కోసం ఈ హెలీరైడ్ ను ప్రారంభించనుంది. ఈ నెల 13 నుంచి మేడారం జాతరకు (Medaram Jatara) వెళ్లే భక్తులకు ఈ హెలికాప్టర్ సర్వీసులను (Helicopter services) అందించనుంది. ఈ మేరకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
బెంగళూరుకి చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ హెలికాప్టర్ రైడ్‌ను (Heli Raid) ప్రారంభించనుంది. ఈ సంస్థ హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి మేడారం జాతరకు (Medaram Jatara) భక్తులు తరలించేందుకు హెలిప్యాడ్ ను రెడీ చేసింది. ఇందుకోసం రానుపోను ఒక్కొక్కరికీ రూ.19,999 ధరను ఛార్జ్ చేయనుంది. ఒక్కో ట్రిప్పులో ఆరుగురి వరుకు వెళ్లొచ్చు.
అలాగే మేడారం జాతరలో ఏరియల్ వ్యూ రైడ్‌కి ఒక్కొక్కరికి రూ.3,700గా ధరను నిర్ణయించినట్లు పర్యాటక శాఖ (telangana Tourism Department) వెల్లడించింది. ఈ రైడ్ 8 నుంచి 10 నిమిషాలు ఉంటుందని ప్రకటించింది. ఈ జాతరకు వచ్చే భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ములుగు జిల్లా కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ హెలీ రైడ్ టికెట్ల్ బుకింగ్ కోసం 94003 99999, 98805 05905 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపింది.
Also Read: Medaram Jatara Buses: ఆర్టీసీ బంపర్ ఆఫర్, రూ.50 టికెట్‌తో మూడు నగరాల్లో 24 గంటలు తిరగొచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Medaram Jatara: మేడారం జాతరకు హెలికాప్టర్ సర్వీసులు
మేడారం వెళ్లే భక్తులకు శుభవార్త
హన్మకొండ నుంచి మేడారానికి హెలికాప్టర్ సర్వీసులు
రాను పోను ఛార్జీ రూ.19,999