Samantha Ruth Prabhu: ఫ్రెండ్స్‌తో ఫుల్‌ ఎంజాయ్ చేస్తోన్న సమంత

Samantha Enjoys with her Friends: వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కలిసి యశోద సినిమాలో నటిస్తోన్న సమంత.. తాజాగా ఆమెకు ఒక ట్రీట్‌ ఇచ్చింది. నీరజా కోన, సామ్, వరలక్ష్మిలు కలిసి సరదాగా గడిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2022, 08:46 PM IST
  • ఫ్రీ టైమ్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న సమంత
  • ఫ్రెండ్స్‌తో సరదాగా గడుపుతోన్న సామ్
  • వరలక్ష్మి శరత్‌ కుమార్‌, నీరజా కోనలతో లంచ్‌ డేట్‌కు వెళ్లిన సమంత
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫోటోలు
Samantha Ruth Prabhu: ఫ్రెండ్స్‌తో ఫుల్‌ ఎంజాయ్ చేస్తోన్న సమంత

Samantha with her Friends: హీరోయిన్‌ సమంత ఏమాత్రం ఫ్రీ టైమ్‌ దొరికినా సరే ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఒక్క క్షణం కూడా వేస్ట్‌ చేయకుండా ఖాళీ సమయాన్ని ఫ్రెండ్స్‌తో గడుపుతోంది సమంత. ఇటీవల షూటింగ్స్‌ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న సామ్.. ఎక్కువగా ఫ్రెండ్స్‌తో టైమ్‌ స్పెండ్‌ చేస్తూ కనిపిస్తోంది. తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో (Shilpa Reddy) పలు ట్రిప్‌లు వేసి ఎంజాయ్ చేసింది సమంత. తన హాలీడే ట్రిప్‌ కోసం స్విట్జర్లాండ్‌ కూడా వెళ్లొచ్చింది ఈ భామ. 

ఇక తాజాగా ఇద్దరు స్నేహితులతో కలిసి సరదాగా గడిపింది సామ్. (Sam) హైదరాబాద్‌లోని ఒక రెస్టారెంట్‌లో సామ్‌ తన ఫ్రెండ్స్‌ వరలక్ష్మి శరత్‌ కుమార్‌, (Varalaxmi Sarathkumar) నీరజా కోనలతో కలిసి లంచ్‌ డేట్‌కు వెళ్లింది సమంత. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా సమంత, వరలక్ష్మిలు కలిసి యశోద మూవీలో నటిస్తున్నారు. 

అలాగే సమంత ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లలో పలు కోట్స్‌ పోస్ట్ చేస్తూ వస్తోంది. క్రమశిక్షణకు సంబంధించి తాజాగా ఒక కొటేషన్‌ పోస్ట్ చేసింది సామ్. డిసిప్లేన్‌తో ఉండమని ఎవరూ మనకు చెప్పాలనుకోరని పేర్కొంది. డిసిప్లేన్‌ (Discipline‌) అనేది మనల్ని ఎంతో స్ట్రాంగ్‌ ఉండేలా తయారు చేస్తుందని సమంత ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది.

Samantha Ruth Prabhu

క్రమశిక్షణతో ఉండడం వల్ల ఒక్కోసారి అంత హ్యాపీగా ఉండకపోవచ్చని.. కానీ భవిష్యత్తులో మాత్రం మంచి ఫలితాలు దక్కుతాయంటూ సమంత పేర్కొంది.ఇక సమంత (Samantha) విజయ్‌ సేతుపతి, నయనతారతో కలిసి నటించిన తమిళ మూవీ ఏప్రిల్‌లో రిలీజ్‌కానుంది. సమంత నటించిన శాకుంతలం మూవీ (Movie) కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక యశోద మూవీలో కూడా సామ్ (Sam) నటిస్తోంది.

Also Read: Inter Exams 2022: ఏప్రిల్​ 20 నుంచి ఇంటర్ పరీక్షలు- పూర్తి షెడ్యూల్ ఇదే..

Also Read: Nellore: మహిళా పోలీసులకు పురుషులతో కొలతలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News