Ratha Saptami Celebrations at Arasavalli Temple : రేపు (ఫిబ్రవరి 8) జరగనున్న రథసప్తమి (Ratha Saptami) వేడుకలకు అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ( Arasavalli SuryanarayanaTemple) ముస్తాబైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి అరసవల్లి సూర్యభగవానుడికి తొలి పూజ చేయనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలోని (Srikakulam District) అరసవల్లిలో సూర్య జయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. మాఘశుద్ధ సప్తమి(రథసప్తమి) రోజున అరసవల్లి క్షేత్రంలో కొలువైన సూర్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. రథసప్తమి వేడుక సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 600 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.
స్వామి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉచిత దర్శనంతో పాటు, రూ.100, రూ.500 టిక్కెట్లు విక్రయించునున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook