Asaduddin Owaisi: హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఒవైసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోం శాఖ తనకు కేటాయించిన 'Z' క్యాటగిరీ సెక్యూరిటీని తిరస్కరించారు.
'నాకు Z క్యాటగిరీ భద్రత వద్దు. మీతో సమానంగా A క్యాటగిరీ పౌరిడిగానే ఉండాలనుకుంటున్నా. నాపై కాల్పులు జరిపిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?'అని లోక్ సభలో అసదుద్ధీన్ ఒవైసీ పేర్కొన్నారు.
యూపీ ఎన్నికల్లో భాగంగా.. నిన్న (గురువారం) ఆయన మీరఠ్‌లో ప్రచారం నిర్వహించి ఢిల్లీకి బయల్దేరిన ఒవైసీ కారుపై కార్పుల జరిగిన విషయం తెలిసింది. ఈదాడి నేపథ్యంలో కేంద్రం తక్షణమే స్పందించి.. ఆయకు రెండో అత్యంత పటిష్ఠమై భద్రత (Z)ను కల్పించాలని నిర్ణయించింది.
ఈ అంశంపై లోక్‌సభలో మాట్లాడిన అసదుద్ధీన్ ఒవైసీ. తన కారుపై కాల్పులు జరిపిన వారిని చూసి భయపడబోనని తెలిపారు. పేదలు సురక్షితంగా ఉన్నప్పుడే తానూ సురక్షితమని పేర్కొన్నారు.
ఇద్దరు అరెస్ట్..
మీరఠ్‌లోని కితౌద ప్రాంతంలో అసద్ కాన్వాయ్‌పై కాల్పులు జరిగిన ఘటనలోలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు కూడా వెల్లడించారు. నిందుతుల్లో ఒకరిపై ఇది వరకే హత్యాయత్నం కేసు ఉన్నట్లు కూడా పోలీసులు వెల్లడించారు.
Also read: Navjot Singh Sidhu: బలహీనమైన వ్యక్తి సీఎంగా ఉండాలనుకుంటున్నారు.. సిద్ధూ సంచలన వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook