SBI Internet services will be unavailable tomorrow: మీరు ఎస్బీఐ కస్టమరా? అయితే ఈ విషయాలు మీరు కత్చితంగా తెలుసుకోవాలి. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో యాప్ సహా ఇంటర్నెట్ అధారంగా పనిచే సే అన్ని సేవలకు రేపు (శనివారం) అంతరాయం (Interruption in SBI services) ఏర్పడనుంది. ఈ విషయాన్ని బ్యాంక్ స్వయంగా వెల్లడించింది.
శనివారం (డిసెంబర్ 11) రాత్రి 11:30 గంటల నుంచి మరుసటి రోజు (డిసెంబర్ 12 ఆదివారం) తెల్లవారుజామున 4:30 వరకు సేవలు నిలిచిపోనున్నాయని ట్విట్టర్ ద్వారా తెలిపింది ఎస్బీఐ.
We request our esteemed customers to bear with us as we strive to provide a better Banking experience. pic.twitter.com/LZsuqO2B0D
— State Bank of India (@TheOfficialSBI) December 10, 2021
ఈ సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్,యూపీఐ సేవలు (SBI internet banking to be down) పని చేయవని తెలిపింది. యూజర్లకు కలిగిస్తున్న అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది ఎస్బీఐ.
కారణాలు ఏమిటి?
బ్యాంక్ సేవలను మరింత మెరుగు పరిచేందుకు సిస్టమ్స్ అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఈ కారణంగానే ఇంటర్నెట్ ఆధారిత సేవలకు అంతరాయం ఏర్పడుతుందని (SBI services to be down) స్పష్టం చేసింది. ఇందుకు సహకరించాలని వినియోగదారులను కోరింది. సిస్టమ్ అప్‌గ్రేడ్ సమయాల్లో లావాదేవీల జరపకుండా ఉండటమే మంచిదని సూచించింది.
ఇంతకు ముందు కూడా చాలా సార్లు సిస్టమ్ అప్‌గ్రేడ్ పేరిట ఎస్బీఐ ఇంటర్నెట్ ఆధారిత సేవలను నిలిపివేసింది. ఇప్పుడు కూడా అలాంటి కారణలతోనే బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.
ఎస్బీఐ గురించి..
ఎస్బీఐ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వం రంగ బ్యాంకు. దేశవ్యాప్తంగా ఎస్బీఐకి 22 వేల బ్రాంచ్‌లు 62,617 ఏటీఎంలు ఉన్నాయి. మొత్తం 45 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. భారత్ కాకుండా మరో 31 దేశాల్లో ఎస్బీఐ కార్యకలాపాలు సాగిస్తోంది. ఆయా దేశాల్లో 229 ఆఫీసులున్నాయి.
Also read: Amazon iPhone XR Sale: రూ.18,599లకే Apple iPhone మీ సొంతం చేసుకోండిలా!
Also read: EPFO : మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. రూ.7 లక్షల ప్రయోజనం పొందండిలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook