Playback Singer Harini Father AK Rao Murderd: తెలుగు నేపథ్య గాయని హరిణి తండ్రి ఏకే రావుది హత్యేనని పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. వారం క్రితం హరిణి కుటుంబం అదృష్యమవగా.. నిన్న ఆమె తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం బయటకు వచ్చింది.
బెంగళూరు సమీపంలోని ఓ రైల్వేట్రాక్‌పై ఏకే రావు (AK Rao) మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. హరిణి కుటుంబం హైదరాబాద్‌లోని శ్రీనగర్లో (Singer Harini Family) నివహిస్తుండేవారు.
మొదట ఆయనది ఆత్మహత్యగా భావించినా.. చేతిపై, గొంతు వద్ద కత్తి గాట్లు గుర్తించి హత్యగా భావించారు పోలీసులు. తాజాగా శవ పరీక్షలోను అదే విషయం వెల్లడైంది.
నిజానికికి ఈ నెల 22న ఏకే రావు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రైల్వే ట్రాక్ పక్కన పడి ఉన్న ఆయన మృత దేహాన్ని మంగళవారం గుర్తించినట్లు పేర్కొన్నారు. మృతదేహవ వద్ద లభించిన గుర్తింపు కార్డుల ద్వారా.. గురువారం కుటుంబ సభ్యులకు ఈ విషయం చేరవేసినట్లు వివరించారు.
ఏకే రావుకు హరిణితో పాటు మరో కుమార్తె శాలినీ కుడా ఉన్నారు. శాలినీ బెంగళూరులో ఉంటారు. ఏకే రావు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డైరెక్టర్‌గా పని చేశారు.
Also read: Rape in Uttar Pradesh: ఎస్సై పరీక్ష రాసి తిరిగొస్తుండగా.. కదులుతున్న కారులో యువతిపై రేప్
Also read: Teacher ends life : లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య.. అవమానం భరించలేక టీచర్ సూసైడ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
A.K. Rao: సింగర్ హరిణి తండ్రిది హత్యే- పోస్ట్ మార్టం రిపోర్టులో వెల్లడి!
హరిణి రావు తండ్రిది హత్యగా నిర్ధారించి పోస్ట్‌మార్టం రిపోర్ట్
వారం క్రితం అదృశ్యమైన ఏకే రావు
బెంగళూరు సమీపంలో లభించిన మృత దేహం