Afghanistan vs Scotland match: స్కాట్లాండ్‌‌ని 130 పరుగుల తేడాతో చిత్తు చేసిన అఫ్గానిస్తాన్

Afghanistan vs Scotland match Highlights: ముజీబుర్ రెహ్మాన్‌కు అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్(Mujeeb Ur Rahman, Rashid Khan) తోడవడంతో స్కాట్లాండ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ముజీబుర్ రెహ్మాన్, రషీద్ ఖాన్.. ఇద్దరూ కలసి 9 వికెట్లు తీసి స్కాట్లాండ్ జట్టును కోలుకోలేని దెబ్బకొట్టారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2021, 12:27 AM IST
Afghanistan vs Scotland match: స్కాట్లాండ్‌‌ని 130 పరుగుల తేడాతో చిత్తు చేసిన అఫ్గానిస్తాన్

Afghanistan vs Scotland match Highlights: టీ20 వరల్డ్ కప్‌ 2021 టోర్నీలో అఫ్గానిస్తాన్ సంచలనం సృష్టించింది. సోమవారం రాత్రి షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 130 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి ఔరా అనిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ హజ్రతుల్లా జజాయ్ (Hazratullah Zazai 44), రహ్మనుల్లా (Rahmanullah Gurbaz 46), నజీబుల్లా జర్దాన్ (Najibullah Zadran 59) వరుసగా రెచ్చిపోయారు. ఫలితంగా టీ20 వరల్డ్ కప్‌ చరిత్రలోనే తొలిసారిగా అఫ్గానిస్తాన్ జట్టు అత్యధిక స్కోర్ సాధించింది. 

అనంతరం 191 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ జట్టుకు ఓపెనర్లు జార్జ్, కైల్ కలసి శుభారంభం అందించే ప్రయత్నం చేశారు. కానీ వారి ఆశలను అడియాసలు చేస్తూ అఫ్గాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మాన్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి స్కాట్లాండ్ నడ్డి విరిచాడు. ముజిబుర్ రెహ్మాన్ బౌలింగ్‌లోనే (Mujeeb Ur Rahman bowling against Scotland) కైల్ కొయెట్జర్ (10), కాలమ్ మాక్లియాడ్ (0), రిచీ బెర్రింగ్టన్ (0) పెవిలియన్ బాటపట్టారు. 

ముజీబుర్ రెహ్మాన్‌కు అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్(Rashid Khan) తోడవడంతో స్కాట్లాండ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ముజీబుర్ రెహ్మాన్, రషీద్ ఖాన్.. ఇద్దరూ కలసి 9 వికెట్లు తీసి స్కాట్లాండ్ జట్టును కోలుకోలేని దెబ్బకొట్టారు. అఫ్గనిస్తాన్ బౌలర్లు స్కాట్లాండ్ బ్యాట్స్‌మెన్‌ని ఎంతలా ఇబ్బంది పెట్టారంటే.. స్కాట్లాండ్ ఆటగాళ్లలో ఐదుగురు ఒక్క పరుగు కూడా చేయకుండానే క్రీజు నుంచి వెనుతిరిగారు. 

Also read : Asaduddin Owaisi, Mohammad Shami: మొహమ్మద్ షమికి అండగా నిలిచిన అసదుద్దీన్

అఫ్గాన్ బౌలర్ల మెరుపుదాడికి స్కాట్లాండ్ జట్టు కేవలం 10.2 ఓవర్లలోనే 60 పరుగులకే ఆలౌట్ చాపచుట్టేసింది. దీంతో అఫ్గానిస్తాన్ జట్టు 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్‌ చరిత్రలో అఫ్గనిస్తాన్ (Afghanistan in T20 world cup 2021) తొలిసారిగా ఎలాగైతే భారీ స్కోర్ చేసిందో.. అలాగే మొట్టమొదటిసారిగా అంతే భారీ విజయం కూడా సొంతం చేసుకోవడం విశేషం. అఫ్గానిస్థాన్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన ముజీబుర్ రెహ్మాన్‌కు (Mujeeb Ur Rahman) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Also read : Varun Chakravarthy's bowling: వరుణ్ చక్రవర్తి బౌలింగ్ పాకిస్థాన్ గల్లీ క్రికెట్‌తో సమానం: సల్మాన్ భట్

Also read : India vs Pakistan: T20 World cup లో10 హాఫ్ సెంచరీలు కొట్టిన తొలి ఆటగాడు Virat Kohli

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News