T20 World Cup 2021: IND Vs PAK మ్యాచ్‌ల్లో అతి పెద్ద కాంట్రావర్శీలు, ఎప్పటికీ గుర్తుండే హైలైట్స్

T20 World Cup 2021 latest updates: Major controversies and highlights in India Vs Pakistan matches: భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఏదో తెలినీ అనుభూతి. కోట్లాది మంది క్రికెట్ ప్రియులు టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటే.. రెండు దేశాలు బ్యాట్, బంతి తీసుకుని మైదానంలో కొట్టుకుంటారా అనేట్టుగా ఉండే క్షణాలు అవి. ఆ క్షణాలు ఇంకెంతో దూరంలో లేవు.

  • Oct 21, 2021, 21:02 PM IST

T20 World Cup 2021 latest updates: Major controversies and highlights in India Vs Pakistan matches: టీ20 వరల్డ్ కప్ 2021 లో భాగంగా గ్రూప్ 2 విభాగంలో భారత్, పాకిస్థాన్ జట్లు అక్టోబర్ 24న తలపడనున్నాయి. అంటే మరో మూడు రోజులే మిగిలి ఉన్నాయన్న మాట. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు భారత్ vs పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సందర్భాల్లో చోటుచేసుకున్న టాప్ 5 కాంట్రావర్శీలు లేదా మెమొరబుల్ మూమెంట్స్‌పై ఓ స్మాల్ లుక్కేద్దాం.

1 /5

అది 2010 ఆసియా కప్ టోర్నమెంట్. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. గౌతం గంభీర్ క్యాచ్ ఔట్ అయినట్టుగా పాకిస్థాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ అత్యుత్సాహంతో అప్పీల్ చేశాడు. అతడి అప్పీలు పట్ల సంతృప్తి చెందని అంపైర్ అతడిని లైట్ తీసుకున్నాడు. ఆ తర్వాత డ్రింక్స్ బ్రేక్ సమయంలో గంబీర్, కమ్రాన్ అక్మల్ మధ్య (Gautam Gambhir vs Kamran Akmal) మొదలైన మాటల యుద్ధం దాదాపు కొట్టుకునే వరకు వెళ్లింది. అక్కడే ఉన్న అంపైర్ బిల్లీ బౌడెన్ కలుగజేసుకుని ఇద్దరిని విడదీశాడు. అదే సమయలో అక్కడే ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ సైతం గంబీర్‌ని వెనక్కి తీసుకొచ్చాడు.

2 /5

అది 2007లో భారత్ vs పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్. షాహిదీ అఫ్రిది బౌలింగ్‌లో గౌతం గంభీర్ బౌండరీ షాట్ కొట్టాడు. దీంతో గంభీర్‌పై షాహిద్ అఫ్రిదీ తనలో తనే ఏదో గొనుక్కోవడం బయటికి వినిపించింది. అయితే, అప్పడు అఫ్రిదీని ఏమీ అనకుండా మౌనంగానే ఉన్న గౌతం గంభీర్ (Gautam Gambhir).. అదే ఓవర్‌లో ఓ సింగిల్ తీసే క్రమంలో అఫ్రిదీని తగులుకున్నాడు. ఒకరిపై ఒకరికి మాటా మాటా పెరిగింది. అఫ్రీదికి (Shahid Afridi) గంభీర్ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. దీంతో అంపైర్లు మధ్యలో కలుగుజేసుకుని ఇద్దరిని కంట్రోల్ చేయాల్సి వచ్చింది.  

3 /5

భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్న ఆ మ్యాచ్‌లో పాక్ విజయం కోసం 41 బంతుల్లో 40 పరుగులు అవసరమయ్యాయి. పాకిస్థాన్ ఆటగాడు ఇంజమాముల్ హక్ బ్యాటింగ్‌లో ఉన్నాడు. ఎస్ శ్రీశాంత్ బౌలింగ్ చేస్తున్నాడు. ఇంజామాముల్ హక్ కొట్టిన షాట్‌ని బౌండరీకి వెళ్లకుండా అడ్డుకున్న సురేష్ రైనా (Suresh Raina).. వెంటనే ఆ బంతిని స్టంప్స్ వైపు విసిరాడు. అయితే అదే సమయంలో అక్కడికి రీచ్ అవుతున్న ఇంజమామ్.. తాను ఔట్ కాకుండా ఉండేందుకు ఆ బంతికి బ్యాట్ అడ్డం పెట్టాడు. దీంతో ఇంజామామ్ వైఖరిని తప్పుపట్టిన అంపైర్ సైమన్ టఫెల్.. తన తోటి అంపైర్ అసద్ రవూఫ్ అభిప్రాయం తీసుకుని అతడిని ఔట్‌గా ప్రకటించాడు.

4 /5

అది 1996 వరల్డ్ కప్. భారత్ విధించిన 287 పరుగుల లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో పాకిస్థాన్ ఆటగాడు అమీర్ సోహైల్ అప్పటికే హాఫ్ సెంచరీ చేసి మంచి ఊపుమీదున్నాడు. వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్ చేస్తున్నాడు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్న అమీర్ సోహైల్ వెంకటేష్ విసిరిన బంతిని కవర్స్‌లో బౌండరీకి తరలిస్తానన్నట్టుగా పాయింట్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వెంకటేష్ ప్రసాద్ (Venkatesh Prasad) విసిరిన మరుసటి బంతికే అమీర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అత్యుత్సాహం మీదున్న అమీర్ నడ్డి విరిచిన వెంకటేష్ ప్రసాద్.. ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలే పనికిరాదని బంతితో సమాధానం చెప్పాడు.

5 /5

అది 1992 వరల్డ్ కప్‌ మ్యాచ్. భారత వికెట్ కీపర్ కిరణ్ మోరె కీపింగ్ చేస్తున్నాడు. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ ఔట్ అయినట్టుగా వికెట్ కీపర్ కిరణ్ తరచుగా అప్పీలు చేస్తుండటంపై ఆగ్రహం చెందిన పాకిస్తాన్ ఆటగాడు జావేద్ మియాందాద్ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే లెగ్-సైడ్ క్యాచ్ పట్టిన కిరణ్ మోరె మరోసారి ఉత్సాహంతో బిగ్గరగా అప్పీలు చేశాడు. దీంతో కిరణ్ వైఖరిపై విసుగు చెందిన మియాందాద్ (Javed Miandad) అతడిని అనుకరిస్తూ వెక్కిరించాడు. అప్పట్లో అదొక ఫన్నీ వీడియో అవడంతో పాటు వివాదంగానూ మారింది. Also read : T20 WC 2021: మెంటార్‌గా ధోని పని మెుదలెట్టేశాడు...వీడియో వైరల్ Also read : India Vs Pakistan Match History: గెట్ రెడీ ఫర్ హై ఓట్లేజ్ మ్యాచ్.. బల్బులు పగలాల్సిందే!