IPL 2021 Finalలో చెన్నై సూపర్‌కింగ్స్ అదరగొట్టేశారు. నాలుగోసారి టైటిల్ సాధించి సత్తా చాటారు. ధోనీ సేనకు తిరుగులేదని నిరూపించారు. ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్ విన్నింగ్ మూమెంట్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
IPL 2021 Winner CSK వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. గత సీజన్‌లో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్‌కింగ్స్(Chennai Superkings) ఈసారి టైటిల్ విజేతగా నిలిచింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుపై 27 పరుగుల తేడాతో విజయబావుటా ఎగురవేసింది. నాలుగోసారి టైటిల్ వశపర్చుకుంది. ధోనీ సేనకు తిరుగులేదని..తనలో సత్తా ఇంకా చావలేదని ధోనీ నిరూపించాడు. విజయదశమి నాడు విజయం సాధించింది సీఎస్‌కే జట్టు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు(Kolkata knight Riders)193 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది చెన్నై సూపర్‌కింగ్స్. ఓపెన్లు శుభమన్ గిల్, వెంకటేశ్ అయ్యర్‌లు ధాటిగా ఆడి చెరో అర్ద సెంచరీ సాధించినా ఫలితం లేకపోయింది. నిర్ణీత 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 165 పరుగులే చేయగలిగింది. సీఎస్‌కే(CSK)నాలుగవసారి టైటిల్ సాధించింది.
విజయానంతరం ధోనీ సేన సంబరాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్, ఇటు సీఎస్‌కే రెండూ తమ ట్విట్టర్ హ్యాండిల్‌పై షేర్ చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి.
Go Shardhool... It's your B'day! 🎂#SuperBirthday #WhistlePodu #Yellove 🦁💛 @imShard pic.twitter.com/K4IzsojkQ7
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 15, 2021
ఇక తరువాత ధోనీ..సీఎస్‌కే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడా లేదా ఇతర బాథ్యతలు తీసుకుంటాడా అనేది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తానికి చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఓ వైపు, అభిమానులు మరోవైపు విజయ సంబరాలు జరుపుకుంటున్నారు.
Say HELLO to #VIVOIPL 2021 CHAMPIONS 🏆🏆🏆🏆#CSKvKKR | #Final | @ChennaiIPL pic.twitter.com/1tnq5C6m2F
— IndianPremierLeague (@IPL) October 15, 2021
Also read: IPL 2021 Final Result: నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ధోనీ సేన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
IPL 2021 Title Winning Movements: నెట్టింట వైరల్ అవుతున్న సీఎస్‌కే జట్టు విన్నింగ్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెన్నై సూపర్‌కింగ్స్ విన్నింగ్ మూమెంట్స్
నాలుగవసారి ఐపీఎల్ టైటిల్ సాధించిన చెన్నై సూపర్‌కింగ్స్
సీఎస్‌కే జట్టుకు కెప్టెన్‌గా ధోనీ కొనసాగనున్నాాడా లేదా