Banks Alert: బ్యాంకుల విలీనం నేపధ్యంలో ఖాతాదారులు తప్పకుండా గుర్తుంచుకోవల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అందుకే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆ నిబంధనలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.
ప్రభుత్వ రంగ బ్యాంకు పరస్పర విలీన ప్రక్రియలో(Banks Merger) భాగంగా బ్యాంకులు ఇతర బ్యాంకుల్లో కలిసిపోయాయి. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు ఖాతాదారులు చెక్ చేసుకోవల్సిన విషయాలు చాలానే ఉంటాయి. ఈ క్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు కొత్త చెక్‌బుక్ నిబంధనల మార్పుకు సంబంధించి ఖాతాదారుల్ని ఎలర్ట్ చేసింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఇండియాలకు చెందిన ప్రస్తుత చెక్‌బుక్‌లు అక్టోబర్ 1,2021 నుంచి పనిచేయవని పీఎన్‌బీ ట్విట్టర్ వేదికగా ప్రకటన చేసింది. ఈ రెండు బ్యాంకుల ఖాతాదారులు పాత చెక్‌బుక్‌ల స్థానంలో కొత్తవి తీసుకోవాలని సూచించింది. ఎందుకంటే ఓబీసీ, యూబీఐ బ్యాంకుల పాత్ చెక్‌బుక్‌లు అక్టోబర్ 1 నుంచి నిలిచిపోతున్నాయి. అందుకే ఐఎఫ్ఎస్‌సి, ఎమ్ఐసీఆర్‌తో అప్‌డేట్ చేసిన కొత్త పీఎన్‌బీ బ్యాంకు చెక్‌బుక్‌లు తీసుకోవల్సిందిగా సూచించింది. ఆన్‌లైన్‌లో అప్లై చేసినా లేదా నేరుగా బ్యాంకుకు వెళ్లి చెక్‌బుక్‌లు తీసుకోవచ్చు. మెగా కన్సాలిడేషన్ ప్రక్రియలో భాగంగా బ్యాంకుల విలీన ప్రక్రియ జరిగింది. ఈ క్రమంలో కేవలం పీఎన్‌బీ బ్యాంకులో(PNB Banks) విలీనమైన బ్యాంకు ఖాతాదారులే కాకుండా..ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాలలో విలీనమైన ఇతర బ్యాంకు ఖాతాదారులు కూడా తమ తమ చెక్‌బుక్‌లు మార్చుకోవల్సి ఉంది.
Also read: Polavaram Project Update: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఏ దశలో ఉందో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook