Cheap and best mobiles: రూ. 10 వేల కంటే తక్కువ ధరలో లభించే Best Smartphones, వాటి Features

Cheap and best mobiles under Rs 10,000: స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఫీచర్స్‌తో పాటు అన్నింటికంటే ముందుగా చాలామంది పరిగణించే కీలకమైన అంశం ఆ స్మార్ట్ ఫోన్ ధర ఎంతనేదే. స్టూడెంట్స్ అయినా.. కుటుంబభారాన్ని మోసే పెద్ద వాళ్లయినా మొబైల్ కొనాల్సి వచ్చినప్పుడు ముందుగా చూసుకునేది తమ వద్ద ఉన్న బడ్జెట్‌లో ఎలాంటి ఫోన్ వస్తుందనేదే ( Best phones in best prices ).

  • Jan 30, 2021, 16:32 PM IST

Cheap and best mobiles under Rs 10,000: స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఫీచర్స్‌తో పాటు అన్నింటికంటే ముందుగా చాలామంది పరిగణించే కీలకమైన అంశం ఆ స్మార్ట్ ఫోన్ ధర ఎంతనేదే. స్టూడెంట్స్ అయినా.. కుటుంబభారాన్ని మోసే పెద్ద వాళ్లయినా మొబైల్ కొనాల్సి వచ్చినప్పుడు ముందుగా చూసుకునేది తమ వద్ద ఉన్న బడ్జెట్‌లో ఎలాంటి ఫోన్ వస్తుందనేదే ( Best phones in best prices ).

 

1 /6

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి Social media ప్లాట్‌ఫామ్స్‌ను ఉపయోగిస్తూ అద్భుతమైన క్లారిటీతో ఫోటోలు, వీడియోలు షూట్ చేయడంతో పాటు స్నేహితులు / కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్ మాట్లాడుకునేందుకు వీలుగా సెల్ఫీ కెమెరా, రీయర్ కెమెరా, ఫోటోలు, వీడియోలు స్టోరేజీకి ఇబ్బందికి వీలు లేకుండా ఎక్కువ స్టోరేజీ ప్లస్ ఎక్స్‌పాండబుల్ మెమొరీ వంటి ఫీచర్స్ అన్నీ తాము తీసుకునే ఫోన్‌లో ఉండాలనే ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు.

2 /6

వీలైతే ఈ ఫీచర్స్ అన్ని రూ .10,000 లోపే వస్తే బాగుంటుందని మిడిల్ క్లాస్ కస్టమర్స్ ఆలోచిస్తారు. అలాంటి ఫోన్ కోసమే ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసే వారి సంఖ్యకు కూడా కొదువేలేదు. అందుకే... సరిగ్గా అలాంటి వారి కోసమే ఇదిగో ఈ డీటేల్స్..

3 /6

షియోమి రెడ్‌మి నోట్ 8 బేస్ వేరియంట్ కోసం 4 GB RAM plus 64 GB internal storage మోడల్ గల స్మార్ట్ ఫోన్ ధర రూ .9,999 గా ఉంది. స్పేస్ బ్లాక్, నెప్ట్యూన్ బ్లూ, మూన్‌లైట్ వైట్, కాస్మిక్ పర్పుల్ వంటి ఎంపిక చేసిన నాలుగు రంగులలో లభిస్తుంది. ఇది 6.3-అంగుళాల FHD + Dilsplay స్క్రీన్‌ను అందిస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4000mAh బ్యాటరీతో నడిచే ఈ షియోమి రెడ్‌మి నోట్ 8 స్మార్ట్ ఫోన్‌లో 13 MP front camera, 48 MP + 2 MP + 2 MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి.

4 /6

క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది. బేస్ వేరియంట్ అయిన 3GB RAM, 32 GB Internal storage కలిగి ఉన్న స్మార్ట్ ఫోన్ ధర రూ .9,999 గా ఉండగా.. 4 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉన్న మరో వేరియంట్ ధర రూ .10,999 గా ఉంది. చివరగా, 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .11,999 గా ఉంది.

5 /6

VIVO U10 smartphone : వివో యు10 స్మార్ట్‌ఫోన్ 9,990 రూపాయల ప్రారంభ ధర వద్ద లభించే Vivo U10 smartphone క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC, 3GB RAM లేదా 4 GB RAM తో వస్తుంది. మీకు 32GB, 64GB స్టోరేజీలోనూ ఈ ఫోన్ లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 6.35 అంగుళాల HD Display కలిగి ఉంది 5000 mAh బ్యాటరీ సపోర్ట్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 13MP + 8MP + 2MP కలిగి ఉంది. ముందువైపు 8MP సెన్సార్ ఉంది.

6 /6

SAMSUNG GALAXY M30: శాంసంగ్ గెలాక్సీ ఎం30 3 RAM, 32 GB internal storage అందించే Samsung Galaxy M 30 బేస్ వేరియంట్ ధర రూ .9,649 గా ఉంది. స్మార్ట్‌ఫోన్ మెటాలిక్ బ్లూ, స్టెయిన్లెస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. 6.4 ఇంచుల FHD + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ 13MP + 5MP + 5MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు వైపు 16MP సెన్సార్ కలిగి ఉంది. 5,000 mah battery సపోర్ట్ ఉన్న శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 30 512 GB micro SD card సపోర్ట్‌ను కలిగి ఉంది.