Republic day celebrations 2021: రిపబ్లిక్ డే వేదికగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మూడు రాజధానుల అంశం, అధికార వికేంద్రీకరణపై స్పష్టత ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికై ప్రభుత్వం స్పష్టమైన ఎజెండా కలిగి ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్పష్టం చేశారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్డేడియంలో 72వ గణతంత్ర వేడుకలు ( 72nd Republic day Celebrations ) ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) వేడుకల్లో పాల్గొన్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ త్రివర్ణపతాకాన్ని ఎగురవేసి..పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన 14 శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. వివిధ శాఖలకు చెందిన శకటాలు ఆకట్టుకుంటున్నాయి. అనంతరం రాష్ట్రాభివృద్ధి, పలు ఇతర అంశాలపై ప్రసంగించారు. ప్రభుత్వ విధానాల్ని ముందుంచారు. ప్రభుత్వ ప్రాధమిక కర్తవ్యాన్ని ప్రజలకు తెలిపారు.
రాష్ట్రాభివృద్ధికై ప్రభుత్వం ( Ap Government ) స్పష్టమైన ఆలోచనతో, ప్రణాళికతో ఉందని గవర్నర్ తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసమే ప్రభుత్వం పని చేస్తోందని..పేద, బడుగు, బలహీన వర్గాల కోసం వివిధ పథకాల్ని ప్రవేశపెట్టిందని వివరించారు. భిన్నత్వంలో ఏకత్వమనేది భారత రాజ్యాంగ సిద్ధాంతమని..అయితే కొందరు ప్రజల మధ్య శాంతిని చెదరగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని గవర్నర్ హరిచందన్ తెలిపారు. కుట్రలు చేసేవారిని నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఉండాలనే ఉద్దేశ్యంతో నవరత్నాలు ప్రకటించామని గుర్తు చేశారు.
రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ( Governor Biswabhusan Harichandan ) స్పష్టం చేశారు. విజయవాడను శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇళ్ల పట్టాల కార్యక్రమం ద్వారా డిసెంబర్ 25వ తేదీన 31 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టామని తెలిపారు. రెండు దశల్లో పేదలందరికీ ఇళ్లు అందించే కార్యక్రమం పూర్తవుతుందని చెప్పారు. ( Ap three capital issue )
Also read: Ap Panchayat Elections 2021: పంచాయితీ ఎన్నికలపై ముందుకెళ్తామని ప్రకటించిన ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Republic day celebrations 2021: మూడు రాజధానులపై స్పష్టత ఇచ్చిన గవర్నర్ బిశ్వభూషణ్ హర
అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ ప్రసంగం, ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
ప్రజల మధ్య అశాంతి రగిల్చేందుకు కుట్ర జరుగుతుందన్న గవర్నర్