Hike Messaging APP Shuts Down, Here Is All You Need To Know About: ఆధునిక కాలంలో మన జీవితంలో సోషల్ మీడియా భాగమైపోతోంది. గతంలో టెక్నాలజీ లేదు కనుక అంతగా మనవారి వివరాలు తెలియకపోవేవి. ప్రస్తుతం మెస్సేజింగ్ యాప్స్ చాటింగ్‌తో పాటు ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే మాధ్యమంగా మారిపోయాయి. ఈ క్రమంలో పుట్టుకొచ్చిన భారతీయ మెస్సేజింగ్ యాప్ హైక్ మెస్సేంజర్ ఓ రేంజ్‌కు వెళ్లింది. కానీ తాజాగా హైక్ మెస్సేజింగ్ యాప్‌ను తీసేశారు. ప్రస్తుతం ప్లే స్టోర్ నుంచి సైతం యాప్‌ను రిమూవ్ చేశారు.
ప్రపంచ దేశాల మెస్సేజింగ్ యాప్‌లకు ధీటుగా భారతీయులు రూపొందించిన యాప్ హైక్ మెసేజింగ్ యాప్(Hike Messaging APP). 2012లో హైక్ యాప్ లాంచ్ అయింది. హైక్ స్టిక్కర్ చాట్స్ అని పిలుచుకున్న ఈ యాప్ తక్కువ సమయంలోనే ఆధరణ పొందింది. వాట్సాప్(WhatsApp) లాంటి కొన్ని విదేశీ యాప్స్ అత్యంత అధునాతన టెక్నాలజీతో రావడంతో హైక్ మెస్సేజింగ్ యాప్ తన ప్రాబవం కోల్పోయింది.
Also Read: Cheapest Recharge Plans: కేవలం 2 రూపాయలకే 1 GB డేటా, కాల్స్
2016లో 100 మిలియన్ల వినియోగదారులకు చేరుకుంది. 10 భారతీయ భాషలలో హైక్ మెస్సేజింగ్ యాప్ సేవలు అందించింది. ఇటీవల హైక్ మెసేంజర్ యాప్ సీఈఓ కెవిన్ భారతీ మిట్టల్ జనవరి 6న ట్విట్టర్లో సంచలన ప్రకటన చేశారు. హైక్ మెస్సేజంర్ యాప్ సేవల్ని త్వరలోనే ముగించనుందని, ఇప్పటివరకూ తమకు మద్దతు తెలిపిన, నమ్మకం ఉంచిన అందరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు.
Also Read: How To Secure Whatsapp: ఈ టిప్స్ పాటిస్తే మీ వాట్సాప్ డేటా సేఫ్
అదే సమయంలో హైక్ సంస్థ ప్రతినిధులు వైబ్, రష్ అనే రెండు అప్లికేషన్లను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఎస్ వెర్షన్లలో యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచారు. మరోవైపు ఓ దశలో 1.4 అమెరికన్ బిలియన్ డాలర్ల విలువకు చేరుకున్న కంపెనీ ఇతర విదేశీ కంపెనీ యాప్స్ నుంచి పోటీని తట్టుకుని తన వినియోగదారులను నిలుపుకోలేకపోయింది. అయితే యాప్ ఎందుకు తీసివేశారనే దానిపై కంపెనీ ఏ విధమైన ప్రకటన చేయలేదు.
Also Read: WhatsApp: ప్రైవసీ పాలసీ నచ్చలేదా.. మీ వాట్సాప్ అకౌంట్ ఇలా డిలీట్ చేసుకోండి
నాలుగేళ్ల కిందట 100 మిలియన్ల యూజర్లకు చేరుకున్న హైక్ మెస్సేంజర్ యాప్ డిసెంబర్ 2019లో కేవలం 2 మిలియన్ల యాక్టివ్ యూజర్లకు పడిపోయింది. అదే సమయంలో వాట్సాప్ లాంటి పోటీ యాప్‌ల మార్కెట్ భారీగా పెరిగింది. ఈ మధ్య కాలంలో సిగ్నల్(Signal App) యాప్ సైతం భారీ డౌన్‌లోడ్స్‌తో దూసుకెళ్తుంటే హైక్ మెస్సేంజర్ యాప్ మాత్రం రోజురోజుకూ ప్రభావాన్ని కోల్పోయి యాప్ తీసివేయడానికి కారణమైనట్లు కనిపిస్తోంది.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. త్వరలో కీలక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook