Petrol, diesel prices: వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూ ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల్లో రెండు నెలల విరామం అనంతరం మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది.అంతర్జాతీయ చమురు ధరల సవరణలో దాదాపు రెండు నెలల విరామానికి ఫుల్‌స్టాప్ పెడుతూ పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుదల బాటపట్టాయి.

  • Nov 22, 2020, 13:26 PM IST

ఇంధనం రిటైలర్లు శుక్రవారం నుంచి ఇంధన ధరలను ( Fuel prices ) పెంచడం ప్రారంభించారు. ధరల మార్పులో రెండు నెలల విరామం తర్వాత వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు ( Petrol and diesel prices ) పెరగడం ఇది మూడోరోజు.

1 /7

పెట్రోల్, డీజిల్ ధరల్లో రెండు నెలల విరామం అనంతరం మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. పెట్రోల్ ధర లీటరుకు 8 పైసలు పెరగగా డీజిల్‌ ధర 19 పైసలు పెరిగింది. అంతర్జాతీయ చమురు ధరల సవరణలో దాదాపు రెండు నెలల విరామానికి ఫుల్‌స్టాప్ పెడుతూ పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుదల బాటపట్టాయి. చమురు మార్కెటింగ్ సంస్థల ధరల నోటిఫికేషన్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ .81.38 నుండి రూ .81.46 కు పెరిగింది. అలాగే పెట్రోల్ బాటలోనే డీజిల్ ధర కూడా లీటర్‌కు రూ .70.88 నుంచి రూ .71.07 కు పెరిగింది.

2 /7

ఇంధనం రిటైలర్లు శుక్రవారం నుంచి ఇంధన ధరలను ( Fuel prices ) పెంచడం ప్రారంభించారు. ధరల మార్పులో రెండు నెలల విరామం తర్వాత వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు ( Petrol and diesel prices ) పెరగడం ఇది మూడోరోజు. 

3 /7

మూడు రోజుల్లో పెట్రోల్ ధర 40 పైసలు, డీజిల్ ధరలు లీటరుకు 61 పైసలు పెరిగాయి. సెప్టెంబర్ 22 నుండి పెట్రోల్ ధరలు స్థిరంగా ఉండగా అక్టోబర్ 2 నుండి డీజిల్ ధరల్లో మార్పు లేదు. 

4 /7

అంతర్జాతీయ చమురు ధరలు, విదేశీ మారకపు రేటు ఆధారంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ( IOCL ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( HPCL ) రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్న సంగతి తెలిసిందే.

5 /7

హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటర్‌కి 9 పైసలు పెరిగి రూ.84.73 కి చేరగా డీజిల్ ధర 21 పైసలు పెరిగి రూ. 77.56 కి చేరింది. 

6 /7

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.88.08 నుంచి రూ.88.16 కి పెరగగా, డీజిల్ ధరలు లీటర్‌కి రూ. 77.34 నుంచి 77.54 కి పెరిగింది. ( Image courtesy : Reuters )

7 /7

పెట్రోల్, డీజిల్ ధరలు స్థానిక పన్నులు, వ్యాట్ ఆధారంగా ఒక రాష్ట్రం నుంచి మరోక రాష్ట్రానికి మారతాయి.