RRR team Deepavali Special Surprise - Photos: జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఊహించిన విధంగానే దీపావళి పర్వదినం సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుంచి సర్ప్రైజ్ వచ్చేసింది. దర్శకరత్న రాజమౌళి ఇద్దరు హీరోలతో కలిసి ఫొటోషూట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ అభిమానులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతూ.. ట్విట్టర్లో ఫొటోలను పంచుకుంది. ఈ దీపావళి ప్రతిఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలంటూ ట్విట్ చేసింది.
అభిమానులకు ఈ సర్ప్రైజ్ ఇచ్చేందుకు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురు కూడా తెల్లటి దుస్తులు ధరించి ఫోటో షూట్లో పాల్గొన్నారు. వీరిని చూసిన అభిమానులు సంతోషంలో మునిగితేలుతున్నారు.
ఈ సినిమాలో తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ కనిపించనున్నారు.
Next Gallery