Oneplus Nord N10 5g: ధరలో చవక.. ఫీచర్స్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్!

  • Oct 27, 2020, 13:23 PM IST

ఐఓఎస్‌లో యాపిల్ మొబైల్స్ ఎంతగా ఫేమసో.. ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు కింగ్ మేకర్లుగా నిలుస్తున్నాయి. తాజాగా వన్‌ప్లస్ నార్డ్ ఎన్10 5జీ స్మార్ట్‌ఫోన్ (oneplus Nord N10 5g) ఆవిష్కరించారు. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో వచ్చిన ఈ మొబైల్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇటీవల ఐఫోన్ 12లో 5జీ తీసుకురాగా.. అందుకు పోటీగా ఆండ్రాయిడ్‌లో వన్‌ప్లస్ నార్డ్ ఎన్10 5జీ లాంచ్ చేశారు.

1 /5

ఐఓఎస్‌లో యాపిల్ మొబైల్స్ ఎంతగా ఫేమసో.. ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు కింగ్ మేకర్లుగా నిలుస్తున్నాయి. తాజాగా వన్‌ప్లస్ నార్డ్ ఎన్10 5జీ స్మార్ట్‌ఫోన్ (oneplus Nord N10 5g) ఆవిష్కరించారు. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో వచ్చిన ఈ మొబైల్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇటీవల ఐఫోన్ 12లో 5జీ తీసుకురాగా.. అందుకు పోటీగా ఆండ్రాయిడ్‌లో వన్‌ప్లస్ నార్డ్ ఎన్10 5జీ లాంచ్ చేశారు.  (Photo Credit: Oneplus)

2 /5

ఈ 5జీ మొబైల్‌లో 6.49 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే ఉంటుంది. వన్‌ప్లస్ నార్డ్ ఎన్10 5జీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌ ఉండటం విశేషం.  మూడు రియర్ కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్‌. ఫ్రంట్ కెమెరా 16 మెగా పిక్సెల్.

3 /5

ప్రస్తుతానికి 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో ఒక్క వేరియంట్‌ను వన్‌ప్లస్ లాంచ్ చేసింది. దీని ధర సుమారు రూ.32,000గా నిర్ణయించారు. మిడ్ నైట్ ఐస్ రంగులో ఈ ఫోన్ లభ్యం కానుంది.

4 /5

ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 690 ప్రాసెసర్‌‌ను ఇందులో అమర్చారు. ఆండ్రాయిడ్‌లో ఆక్సిజన్ ఓఎస్ 10.5తో వన్‌ప్లస్ నార్డ్ 10జీ 5జీ స్మార్ట్‌ఫోన్ పనిచేయనుంది.

5 /5

ఇందులో ఆక్టాకోర్ ప్రాసెసర్, స్టీరియో స్పీకర్ అందుబాటులో ఉంది. ఈ మొబైల్స్ మొదటగా యూరప్‌లో లాంచ్ చేశారు. త్వరలో భారత్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. (Photo: india.com)