శ్రీనగర్: జమ్మూ-కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా బొమై ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు భద్రతాదళాలపై ఆదివారం రాత్రి కాల్పులు జరిపారు. వెంటనే హుషారైన భద్రతాదళాలు తిప్పికొట్టారు. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు తీవ్రవాదులు చనిపోయారు. మరొక తీవ్రవాది గాయపడి పట్టుబడ్డాడని సోమవారం ఏఎన్ఐ నివేదించింది.
ఈ ప్రాంతంలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించిన తరువాత ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం కాల్పులు నిలిపివేసినప్పటికీ, సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. "జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఆర్ఆర్&సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి"అని ఆ రాష్ట్ర డీజీపీ ఎస్పీ వైద్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
In unisoo Handwara all the three terrorists apparently Pakistanis have been neutralised by Joint team of J&K Police, RR &CRPF. It has been raining whole night & boys were out there in the cold.
— Shesh Paul Vaid (@spvaid) December 11, 2017
హ్యాండ్వారలో ఉన్న లష్కర్-ఇ-తోయిబాకు చెందిన ఓ ఓవర్ గ్రౌండ్ వర్కర్ (ఒజిడబ్ల్యు)ను అరెస్టు చేసిన తరువాత, భద్రతా దళాలు ఆదివారం హజీన్ జిల్లాలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతం సైన్యం నిఘానీడలో ఉంది.
జమ్మూకాశ్మీర్లో ముగ్గురు తీవ్రవాదులు హతం