గుజరాత్ తొలిదశ పోలింగ్ షురూ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ మొదలయ్యింది. తొలిదశ పోలింగ్ మొత్తం 89 స్థానాలకు జరుగుతోంది.

Last Updated : Dec 9, 2017, 06:59 PM IST
గుజరాత్ తొలిదశ పోలింగ్ షురూ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ మొదలయ్యింది. తొలిదశ పోలింగ్ మొత్తం 89 స్థానాలకు జరుగుతోంది. తొలిదశ పోలింగ్ జరిగే స్థానాలలో సీఎం విజయ్ రూపానీ, కాంగ్రెస్ ప్రతిపక్ష నేత శక్తిసింగ్ గోహిల్ తదితర రాజకీయ ప్రముఖులు ఉన్నారు. కుల, మత, భావోద్వేగ ప్రసంగాలతో పాటు రాష్ట్ర ప్రగతిపై పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. 

 

 

తొలిదశ పోలింగ్ జరిగే స్థానాల్లో 977 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 2.12 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. డిసెంబర్ 14న రెండోవిడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 18న ఓట్లగణనతో అధికారంలోకి ఎవరొస్తారో తేలిపోతుంది.

Trending News