Guna: రైతు దంపతులపై పోలీసుల దాడి.. జిల్లా ఎస్పీ, కలెక్టర్‌పై సస్పెన్షన్ వేటు

Guna district: భోపాల్: భూ ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లిన పోలీసులు.. అక్కడ తమను అడ్డుకున్న రైతు దంపతులపై ( Dalit couple thrashed ) విచక్షణారహితంగా కొట్టి దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటన అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా.. గ్రామస్తులే వారిని ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Jul 16, 2020, 06:11 PM IST
Guna: రైతు దంపతులపై పోలీసుల దాడి.. జిల్లా ఎస్పీ, కలెక్టర్‌పై సస్పెన్షన్ వేటు

Guna district: భోపాల్: భూ ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లిన పోలీసులు.. అక్కడ తమను అడ్డుకున్న రైతు దంపతులపై ( Dalit couple thrashed ) విచక్షణారహితంగా కొట్టి దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటన అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా.. గ్రామస్తులే వారిని ఆస్పత్రికి తరలించారు. దంపతులపై దాడికి సంబంధించిన దృశ్యాలు, ఫోటోలు సామాజిక మాథ్యమాల్లో వైరల్‌గా మారడంతో పాటు పోలీసుల పైశాచికత్వంపై ( Police brutality ), ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బాధితులు దళితులు కావడం వల్లే పోలీసులు వారిని చితకబాదారంటూ దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆందోళనలకు దిగాయి. ప్రతిపక్షాలు సైతం ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తంచేశాయి. ( Also read: Big Breaking: రామ మందిరం భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోదీ ? )

గుణ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించినందుకుగాను ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ తగిన మూల్యం చెల్లించుకున్నారు. గుణ జిల్లాలో రైతు దంపతులపై దాడి ఘటనపై స్పందించిన మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ( MP CM Shivraj Singh Chouhan )... బుధవారం అర్ధరాత్రే గుణ జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ని సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. గుణ జిల్లా కలెక్టర్, ఎస్పీపై సస్పెన్షన్ వేటు వేసిన సీఎం శివరాజ్ సింగ్... హింస ( Vandalism ) ఏ రూపంలో ఉన్నా ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ( Also read: India: ఒక్కరోజులో రికార్డు కరోనా కేసులు )

కాలేజీకి కేటాయించిన స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారని ( Encroachments )... వారిని ఖాళీ చేయించేందుకు వెళ్లిన సందర్భంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానిక తహశీల్దార్ ఎన్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం దంపతులు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎన్ సింగ్ పేర్కొన్నారు.

Also read: AP: కరోనా తీవ్రరూపం.. 24 గంటల్లో 40 మంది మృతి

Trending News