/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168

న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో పనిచేస్తోన్న సిబ్బందిలో 33 మందికి కరోనా వైరస్ పాజిటివ్ సోకిందనే వార్త నుంచి వైద్య ప్రపంచం ఇంకా తేరుకోకముందే తాజాగా ఢిల్లీలోనే మరో షాకింగ్ న్యూస్ వెలుగుచూసింది. జగ్జీవన్ రామ్ ఆస్పత్రిలో మంగళవారం 77 మందికి కరోనా సోకినట్టుగా తేలింది. అందులో 75 మంది ఆస్పత్రి సిబ్బంది కాగా మరో ఇద్దరు అదే ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు ఉన్నారు. మ్యాక్స్ ఆస్పత్రులలో పనిచేస్తోన్న వారిలో 10 వేలకు పైగా సిబ్బందికి ఆస్పత్రి యాజమాన్యం కరోనా పరీక్షలు చేయిస్తుండగా వారిలో 33 మందికి కరోనా సోకిందని గుర్తించిన సంగతి తెలిసిందే. మ్యాక్స్ ఆస్పత్రి ఘటన తర్వాత 24 గంటలు కూడా గడవక ముందే తాజాగా జగ్జీవన్ రామ్ ఆస్పత్రిలో 77 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడం వైద్య సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోంది.  

Also read : చిరంజీవి పాటకు మనవరాలి ‘మెగా’ జోరు.. వైరల్ వీడియో!

బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రిలోనూ 30 మంది సిబ్బందికి కరోనా సోకిందని గుర్తించిన నేపథ్యంలో అదే ఆస్పత్రికి చెందిన మరో 39 మంది సిబ్బందిని సోమవారం క్వారంటైన్‌కి తరలించారు. ఇదిలావుంటే, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వారి సంఖ్య 3,108 కాగా వారిలో 877 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 54 మంది కరోనాతోనే చనిపోయారు.

Also read : ఏపీలో మరో 82 కరోనా కేసులు.. ఓ జిల్లాలో 300కు పైగా బాధితులు!

కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 29,435కి చేరగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,869 గా ఉంది. ఇప్పటి వరకు కరోనా కారణంగా 934 మృతి చెందారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Section: 
English Title: 
77 healthcare workers of Jagjivan Ram hospital in Delhi tests positive for coronavirus
News Source: 
Home Title: 

ఆస్పత్రిలో 77 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్

ఆస్పత్రిలో 77 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఆస్పత్రిలో 77 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్
Publish Later: 
No
Publish At: 
Tuesday, April 28, 2020 - 15:54