Netflix Free Plans: ఈ ప్లాన్స్ తీసుకుంటే 84 రోజులు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్

Netflix Free Plans: కరోనా సమయం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఓటీటీలకు ఆదరణ బాగా పెరిగింది. ఈ మధ్య కాలంలో అయితే అసలు థియేటర్‌కు వెళ్లడమే తగ్గిపోయింది. అందుకే ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. పూర్తి వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 23, 2025, 06:34 PM IST
Netflix Free Plans: ఈ ప్లాన్స్ తీసుకుంటే 84 రోజులు ఫ్రీ నెట్‌ఫ్లిక్స్

Netflix Free Plans: నచ్చిన సినిమా లేదా వెబ్‌సిరీస్ నచ్చిన సమయంలో నచ్చిన భాషలో నచ్చినట్టుగా చూసే వీలుండటంతో ఓటీటీలపై జనం ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే వివిధ టెలీకం కంపెనీలు యూజర్లను ఆకర్షించేందుకు రీఛార్జ్ ప్లాన్స్‌తో పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా అందిస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియం ఓటీటీగా భావించే నెట్‌ఫ్లిక్స్ కూడా ఇప్పుడు కొన్ని ప్లాన్స్‌తో ఉచితంగా లభించనుంది. 

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఆహా, జీ5, సోనీలివ్ ఇలా ఒకటేమిటి చాలా ఓటీటీలు అదుబాటులో ఉన్నాయి. వీటిలో అన్నింటికంటే ఖరీదైంది, డిమాండ్ ఉన్నది నెట్‌ఫ్లిక్స్ మాత్రమే. ఎందుకంటే దాదాపుగా హిట్ సినిమా, కొత్త కొత్త సినిమాలు అన్నీ నెట్‌ ఫ్లిక్స్‌లోనే స్ట్రీమ్ అవుతుంటాయి. అందుకే నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ స్ట్రీమింగ్ అటే అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు కొన్ని ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటే నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా అందిస్తున్నాయి. అది కూడా ఏకంగా 84 రోజులు ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తోంది. ఆ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్ 1798 రీఛార్జ్ ప్లాన్

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. 1798 రూపాయలు ఖర్చవుతుంది. రోజుకు 3 జీబీ డేటా చొప్పున మొత్తం 252 జీబీ లభిస్తుంది. ఇక వాయిస్ కాల్స్ అన్‌లిమిటెడ్ ఉంటాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. స్పామ్‌కాల్ అలర్ట్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాక్సెస్, అపోలో ఫ్రీ సర్వీస్, ఉచిత హెలో ట్యూన్స్ ప్రయోజనాలు ఉంటాయి. నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా 84 రోజులు ఎంజాయ్ చేయవచ్చు.

జియో 1299 రీ ఛార్జ్ ప్లాన్

ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. రోజుకు 2జీబీ డేటా మొత్తం 168 జీబీ ఉంటుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. ఈ ప్లాన్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ 84 రోజులు ఉచితంగా స్ట్రీమింగ్ ఉంటుంది. వీటితో పాటు జియో టీవీ, జియో క్లౌడ్ యాక్సెస్ ఉంటుంది. 

జియో 1799 రీఛార్జ్ ప్లాన్

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది. రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ లు పంపించవచ్చు. ఈ ప్లాన్‌తో పాటు జియో టీవీ, జియో క్లౌడ్ ఉచితంగా లభిస్తాయి. నెట్‌ఫ్లిక్స్ మొబైల్ వెర్షన్ 84 రోజుల సబ్‌స్క్రిప్షన్ ఎంజాయ్ చేయవచ్చు.

వోడాఫోన్ ఐడియా 1599 ప్లాన్

ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. రోజుకు 2.5 జీబీ డేటాతో మొత్తం 210 జీబీ డేటా లభిస్తుంది. అన్‌‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 10 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. నెట్‌ఫ్లిక్స్ 84 రోజులు ఉచితంగా స్ట్రీమింగ్ ఉంటుంది. 

Also read: Jio New Plan: 195 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో జియో హాట్‌స్టార్ ఉచితం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News