Prabhas Spirit Update: ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో బిజీగా ఉన్నాడు. రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయన, త్వరలో కల్కి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ప్రాజెక్టులతో పాటు స్పిరిట్ కూడా లైన్లో ఉంది.
వరుస సినిమాలు చేస్తూ, అన్నింటికీ సమయం కేటాయించటం ప్రభాస్‌కు కొత్త కాదు. అయితే, ‘స్పిరిట్’ విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కొన్ని కఠిన నిబంధనలు పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాకు పూర్తిగా డెడికేట్ అవ్వాలని, మరో ప్రాజెక్ట్ చేయకూడదని ప్రభాస్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.
ప్రత్యేకమైన లుక్‌తో కనిపించాలంటే, అతని శరీరాకృతి, స్టైల్ పూర్తిగా మారాలి. అందుకే, సినిమా పూర్తయ్యే వరకు లుక్ బయటకు రాకూడదని ప్రభాస్.. అలానే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ నిర్ణయించుకున్నాడు.
ప్రస్తుతం ‘స్పిరిట్’ స్క్రిప్ట్ పనుల్లో సందీప్ రెడ్డి వంగా బిజీగా ఉన్నాడు. ఈ లోపల ప్రభాస్ తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. సందీప్ తన చిత్రాలను అత్యుత్తమంగా మలచాలనే పట్టుదలతో ఉంటాడు. అతని టీమ్‌లో పని చేసే వారంతా పూర్తి నిబద్ధతతో ఉండాలి అని సాధారణంగా కండిషన్స్ పెడుతూనే ఉంటారు. ఈ క్రమంలో.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో వరస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కి ఇలాంటి కండిషన్ పెట్టడం అందరిని ఆశ్చర్య పరోస్తోంది.
అయితే ప్రభాస్ వంటి స్టార్ కూడా సందీప్ స్టైల్‌ను గౌరవిస్తున్నాడు. ‘స్పిరిట్’ సినిమాకు ఉన్న అంచనాలు ఆయన ఇతర ప్రాజెక్టుల కంటే ఎక్కువగా ఉండడంతో.. ఈ హీరో ఈ కండిషన్కు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అందుకే, దర్శకుడి షరతులను అన్నీ కూడా.. ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది.
మొత్తానికి సంవత్సరానికి ఏకంగా రెండు మూడు సినిమాలు చేసే ప్రభాస్ కి.. బాహుబలి లాగా మరోసారి రెండు మూడు సంవత్సరాల పాటు ఎలాంటి సినిమా లేకుండా ప్యాచ్ పడేటట్టు ఉంది. అయినా కానీ ప్రభాస్ ఈ నిర్ణయానికి ఒప్పుకోవడంతో.. ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులకు కూడా అతనికి ఒక సినిమా పట్ల ఉన్న డెడికేషన్ కి అభినందిస్తున్నారు.
Also Read: YSRCP MLAs Entry Assembly: వైఎస్ జగన్ యూటర్న్..! అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం
Also Read: APPSC Group 2 Mains: చంద్రబాబుకు భారీ షాక్.. రేపు యథావిధిగా ఏపీపీఎస్సీ గ్రూపు 2 పరీక్షలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.