Seize The Ship: సీజ్ ది షిప్ అంటూ సముద్ర తీరంలో హల్‌చల్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన యవ్వారం మూణ్నాళ్ల ముచ్చటగా కనిపిస్తోంది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలో యథేచ్చగా రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతోంది. బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. మరోసారి పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తున్న బియ్యం పట్టుబడింది. పోలీసులు బియ్యం స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: YSRCP MLAs Entry Assembly: వైఎస్ జగన్ యూటర్న్..! అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం
జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా జోక్యం చేసుకుని 'సీజ్ ది షిప్' అంటూ పోర్టులో హల్‌చల్ చేశారు. మూడు వారాలపాటు విదేశీ నౌక నిలిపివేసినా కాకినాడ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమలు ఆగడం లేదు. తిరిగి పీడీఎస్ బియ్యం ఎగుమతులు మొదలవడంతో పవన్ కల్యాణ్ పనితీరుపై.. అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నెల 21వ తేదీన పోర్టుకు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా నాలుగు లారీలు తనిఖీ చేయగా.. 92 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని లారీలు సీజ్ చేశారు.
Also Read: APPSC Group 2 Mains: చంద్రబాబుకు భారీ షాక్.. రేపు యథావిధిగా ఏపీపీఎస్సీ గ్రూపు 2 పరీక్షలు
రేషన్ బియ్యం తరలింపుపై కేసు నమోదు చేశామని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. సీజ్ చేసిన బియ్యం బియ్యాన్ని గిడ్డంగికి తరలించినట్లు చెప్పారు. రేషన్ బియ్యం తరలింపుపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జేసీ రాహుల్ మీనా వెల్లడించారు. అయితే 21న దాడులు చేస్తే 23వ తేదీన బయట పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటని అధికారులే ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఇలా చేసి ఉన్నారని చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం కాకినాడ జిల్లాతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది. స్వయంగా డిప్యూటీ సీఎం రంగంలోకి దిగి సీజ్ ది షిప్ అని చెప్పినా కూడా ఇంకా అక్రమ బియ్యం రవాణా అడ్డుకట్ట పడకపోవడంతో అధికారుల పనితీరుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ రవాణా వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆలస్యంగా ఈ వివరాలు వెల్లడించారని ఆరోపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.