Pawan Kalyan Health Update: పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలు.. ఇంకోవైపు తన నియోజకవర్గానికి సంబంధించిన పనులతో తీరిక లేకుండా ఉన్నారు. దీంతో ఆయన చేయాల్సిన సినిమాలు కూడా లేట్ అవుతూ వస్తున్నాయి. మరోవైపు క్షణం తీరిక లేకుండా తిరుగుతూ ఉండటం మూలానా పవన్ కళ్యాణ్ ను వెన్ను నొప్పి వెంటాడుతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో తన కోడలు ఉపాసనకు సంబంధించిన అపోలో హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అంతేకాదు త్వరలో మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉందని డాక్టర్లు చెప్పారు0. ఈ నెలాఖరున లేదా మార్చి మొదటి వారంలో మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.
పవన్ కల్యాణ్, గత కొంతకాలంగా బ్యాక్‌పెయిన్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఆ మధ్య కేబినెట్ సమావేశానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు.. ఇక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకున్న సమయంలోనూ.. ఆయన ఆయుర్వేద వైద్యుల సలహాలు తీసుకున్నట్టుగా సమాచారం. ఈ సందర్భంగా ఆ వైద్యులు ఇచ్చిన కొన్ని మూలికలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న శ్రీ @PawanKalyan గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు ఈ రోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని… pic.twitter.com/TjeWc4T0WZ— JanaSena Party (@JanaSenaParty) February 22, 2025
తాజాగా ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో వెన్ను నొప్పి కారణంగానే ఏపీలో కొన్ని ముఖ్యమైన సమావేశాలకు హాజరు కాలేకపోయానని.. ఇప్పటికీ వెన్న నొప్పి తీవ్రంగా వుందని పవన్ కల్యాణ్ స్వయంగా వెల్లడించారు. కాగా, తాజాగా పవన్ కల్యాణ్ అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలను చేసుకున్న విషయాన్ని ఫొటోలతో సహా వెల్లడించింది జనసేన పార్టీ.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఈ నెల 24వ నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలకు పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ భేటీకానున్నారు. ఏపీ బడ్జెట్ పై అవగాహన కల్పించడంతో పాటు, సభలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలకు పవన్ దిశానిర్దేశం చేస్తారు.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.