Telangana Bird Flu Case: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి దడ పుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవడంతో ఏపీ నుంచి తెలంగాణకు కోళ్ల సరఫరా నిలిపివేశారు. ఎక్కడికక్కడ కోళ్ల సరఫరాను నియంత్రించినా కూడా తెలంగాణలోకి బర్డ్ ఫ్లూ ప్రవేశించింది. తెలంగాణలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. కేసు నమోదవడంతో కలకలం రేపుతోంది. ప్రస్తుతానికి ఒక కేసు నమోదు కాగా.. రెండు, మూడు రోజుల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. బర్డ్‌ఫ్లూ కేసు ఎక్కడ? ఎప్పుడు నమోదైందో వివరాలు తెలుసుకుందాం.
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటి బర్డ్ ప్ల్ వ్యాధి నిర్ధారణ అయ్యింద. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో పది రోజులుగా కోళ్లు భారీ సంఖ్యలో మృతి చెందుతున్నాయి. మృతి చెందిన కోళ్లను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కి తరలించి పరీక్షలు చేయగా.. వాటిలో ఒకటి బర్డ్ ఫ్లూ కేసు నిర్ధారణ జరిగింది. ఈ విషయం అధికారులు ధ్రువీకరించడంతో ఆ గ్రామంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన మొదలైంది. బర్డ్ ఫ్లూ నిర్ధారణ జరిగిన కోళ్ల ఫారం పరిధిలో కిలోమీటర్ ఉన్న కోళ్ల ఫారంతో గ్రామంలోని మిగతా కోళ్లను పరీక్షించారు. వాటి పరీక్ష ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Also Read: Govt Holiday: విద్యార్థులు, ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై ప్రతి నెల నాలుగో శనివారం సెలవు
బర్డ్ ఫ్లూ నమోదైన ప్రాంతం పరిధిలోని పది కిలోమీటర్ల మేర సర్వలేన్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. కిలోమీటర్ పరిధిలోని కోళ్ల అన్నిటిని పరీక్షించి కలెక్ట్ చేసి పరీక్షలు నిమిత్తం హైదరాబాద్ పంపించారు. ఈ కేసు నమోదుతో నేలపట్ల గ్రామంలో పోలీస్ పికెటింగ్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నేలపట్ల పరిధిలో మొత్తం కిలోమీటర్ పరిధిలో ఐదు కోళ్ల ఫామ్స్ ఉన్నాయి. వాటిలో కూడా శాంపిళ్లు తీసుకుని ల్యాబ్ పరీక్షలకు పంపించారు. అయితే బర్డ్‌ఫ్లూ వ్యాపించినా కూడా చికెన్, గుడ్లు తినవచ్చని.. వాటి వలన ఎవరికీ ఎలాంటి హాని జరగదని అధికారులు చెబుతున్నారు. అయితే అధికారులు ఎన్ని చెప్పినా కూడా ప్రజల్లో భయాందోళన తీవ్రంగా ఉంది. దీని ఫలితంగా రెండు వారాలుగా హైదరాబాద్‌తోపాటు తెలంగాణవ్యాప్తంగా భారీగా చికెన్ విక్రయాలు తగ్గాయి. చికెన్ వ్యాపారం భారీ నష్టాల్లో కొనసాగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.