మూవీ రివ్యూ: డెవిల్స్ చైర్(Devils Chair)
నటీనటులు: అభినవ కృష్ణ (అదిరే అభి ), స్వాతి మండల్, ఛత్రపతి శేఖర్, వెంకట్ దుగ్గిరెడ్డి యూ ఎస్ ఏ, రేష్మ తదితరులు
సంగీతం: బిషేక్
సినిమాటోగ్రఫీ: విజయానంద్
ఎడిటర్: హేమంత్ నాగ్
బ్యానర్స్: బాబీ ఫిలిమ్స్ , ఓం సాయి ఆర్ట్స్ , సి ఆర్ ఎస్ క్రియేషన్స్
నిర్మాతలు: చైతన్య , వెంకట్ దుగ్గిరెడ్డి ,
రచన, దర్శకత్వం: గంగ సప్తశిఖర
విడుదల తేది: 21-2-2025
అదిరే అభి హీరోగా.. స్వాతి మండల్ హీరోయిన్గా బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సి ఆర్ ఎస్ క్రియేషన్స్ కలిసి నిర్మించిన చిత్రం ‘ది డెవిల్స్ చైర్’. గంగ సప్త శిఖర దర్శకత్వంలో కె కె చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి, చంద్ర సుబ్బగారి కలిసి నిర్మించిన ఈ హార్రర్ త్రిల్లర్ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్స్ లో భయపెట్టిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
విక్రమ్(అదిరే అభి) జూదానికి బానిసై పోతాడు. అంతేకాదు తాను ఉద్యోగం చేస్తోన్న కంపెనీలోని కోటి రూపాయలు తెలియకుండా కొట్టేసి బెట్టింగ్ ఆడతాడు. ఈజీ మనీకి అలవాటు పడ్డ విక్రమ్.. ఉద్యోగం పోగోట్టుకోవడంతో పాటు న్యాయ పరకంగా చిక్కుల్లో పడతాడు.
ఇతనికి రుధిర(స్వాతి మండల్) అనే ఎయిర్ హోస్టెస్ లవర్ ఉంటుంది. విక్రమ్ కి ఉద్యోగం పోవడంతో తనే ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉంటుంది. వీళ్లిద్దరూ మ్యారేజ్ చేసుకుని లైఫ్ లో సెటిల్ కావాలనుకుంటారు.ఈ క్రమంలో విక్రమ్ ను ఏదైనా ఉద్యోగం చూసుకోమని ఒత్తిడి తెస్తూ వుంటుంది. అదే టైమ్ లో ఉరుములేని పిడుగులా గతంలో పనిచేసిన కంపెనీలో కోటి రూపాయలను వెంటనే కట్టాలని కంపెనీ యాజమాన్యం అతడిపై ఒత్తిడి చేస్తుంది. అదే సమయంలో రుధిర ఒక పురాతనైన చైర్ ను ఎంతో ఇష్టపడి తెచ్చుకుంటుంది. ఆ చైర్ వల్ల అభికి కావాల్సినప్పుడల్లా డబ్బులు వస్తుంటాయి. అయితే ఆ చైర్ నీకు రూ. 5 కోట్లు ఇస్తాను. నీ ప్రియురాలిని చంపమని చెబుతుంది. అప్పటికే పీకల అప్పుల్లో కూరుకుపోయిన విక్రమ్... రూ.5కోట్ల కోసం తన లవర్ ను హత్య చేసాడా.. ? ఆ చైర్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే:
ఏ సినిమా కైనా కథే ప్రాణం. కథలో బలం లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా నైనా ప్రేక్షకులు రిజెక్ట్ చేసే రోజులు. తాజాగా విడుదలైన ‘డెవిల్స్ చైర్’ సినిమాకు కథే ప్రాణం. దర్శకుడు గంగ సప్తశిఖర ఈ సినిమాను మంచి కథ, కథనాలతో గ్రిస్పింగ్ గా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. ఈ సినిమా టైటిల్ ‘డెవిల్స్ చైర్’ యూనివర్సల్ అప్పీల్ ఉంది. మనిషికి ఉండే దురాశ ఎలాంటి పనులు చేయిస్తుందో ఈ సినిమానే ఉదాహరణ. ఈజీ మనీకి అలవాటు పడ్డ వారు కన్నవాళ్లను సైతం కడతేర్చడానికి వెనకాడరనే విషయాన్ని ఈ సినిమాలో చూపెట్టారు. ముఖ్యంగా దురాశ దు:ఖానికి చేటు అనేది ఈ సినిమాలో చక్కగా చూపించారు. ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేయడంలో దర్శకుడు గంగ సప్తశిఖర విజయం సాధించాడు. మొత్తంగా తాను అనుకున్న బడ్జెట్ లో ఉన్న వనరులతో ఈ సినిమాను తెరకెక్కించిన విధానం బాగుంది. అంతేకాదు ఈ సినిమాలో వినోదంతో పాటు హార్రర్ అంశాలతో పాటు ఓ సందేశాన్ని ఇచ్చాడు దర్శకుడు. డైరెక్టర్ గంగ శిఖర తొలి ప్రయత్నంలో సక్సెస్ సాధించాడనే చెప్పాలి. ఓ యూనిక్ కాన్సెప్ట్ ను ప్రేక్షకులకు చేరువయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు ఓకే. ఎడిటింగ్ పర్వాలేదు. ఓవరాల్ గా కామన్ ఆడియన్స్ ను ఈ సినిమా ఆకట్టుకుంటుంది.
నటీనటుల విషయానికొస్తే..
జబర్దస్త్ షోతో అదిరే అభిగా పరిచయమై మంచి కామెడీ టైమింగ్ ఉన్న యాక్టింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాడు. 20 యేళ్లుగా ఇండస్ట్రీలో పడుతూ లేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న అదిరే అభికి హీరోగా మంచి లైఫ్ ఇస్తుంది. ఈ సినిమాలో రెండు మూడు వేరియషన్స్ లో అభి యాక్టింగ్ కట్టిపడేస్తోంది. హీరోయిన్ గా నటించిన స్వాతి మండల్ క్యూట్ నటనతో ఆకట్టుకుంది. ఛత్రపతి శేఖర్ ప్రొ ఫెసర్ పాత్రలో మెప్పించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. భయపెడుతూ మెసెజ్ ఇచ్చే ‘డెవిల్స్ చైర్’..
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.