Sreeja second husband: మళ్లీ ప్రేమలో పడ్డ శ్రీజ రెండో భర్త.. ఎవరితో అంతే..?

Kalyan Dev: ప్రముఖ మెగాస్టార్ చిరంజీవి.. చిన్న కుమార్తె శ్రీజ రెండవ భర్త కళ్యాణ్ దేవ్ త్వరలోనే మరో పెళ్లికి సిద్ధమవుతున్నారు అనే వార్త వైరల్ అవుతుంది. ఈ క్రమంలో ఇతను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఈ రూమర్స్ కి మరింత ఆజ్యం పోసింది
 

1 /5

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి అందరికీ సుపరిచితమే.. ఆయన చిన్న కూతురు శ్రీజ కూడా వ్యక్తిగత కారణాలవల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మొదట తాను ప్రేమించిన అబ్బాయి కోసం కుటుంబ సభ్యులను ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుంది. వీరి బంధానికి గుర్తుగా ఒక అమ్మాయి జన్మించింది. అయితే అతడి ఆగడాలు తట్టుకోలేక అతడికి విడాకులు ఇచ్చి తండ్రి వద్దకు చేరింది. 

2 /5

ఇక చిరంజీవి కూతురు భవిష్యత్తు కోసం కళ్యాణ్ దేవ్ ను ఇచ్చి వివాహం జరిపించారు. వీరి బంధానికి గుర్తుగా ఒక పాప జన్మించింది. అంతా సవ్యంగా సాగుతోంది అనుకునే లోపే మళ్ళీ వీరిద్దరు కూడా విడాకులు తీసుకున్నారు. 

3 /5

ఇకపోతే ఈ విషయంపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నా.. ఎవరూ కూడా స్పందించడం లేదు. ఇక కళ్యాణ్ దేవ్ తన కూతుర్ని వారానికి ఒకసారి కలుస్తూ పాపతో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంటూ ఉంటారు. 

4 /5

అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిన కళ్యాణ్ దేవ్.. మళ్లీ యాక్టివ్ అయి రోజాపూలతో పాటు కూతురుతో దిగిన ఫోటోలను పంచుకున్నారు.  

5 /5

ఇక అందులో నేను ఎక్కువగా ప్రేమించడాన్ని ఇష్టపడతాను.. మీరు కూడా అలాగే ఇష్టపడతారా ? అంటూ క్యాప్షన్ కూడా జోడించారు. ఇక దీన్ని బట్టి చూస్తే కళ్యాణ్ దేవ్ మళ్లీ ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని మీడియా ఛానల్స్ లో త్వరలోనే కళ్యాణ్ లో పెళ్లి చేసుకోనున్నారు.. అనే వార్తలు కూడా వస్తున్నాయి. బెంగళూరు అమ్మాయి అన్న విషయం కూడా వినిపిస్తోంది. ఇక దీనిపై నిజా నిజాలు తెలియాల్సి వుంది.