Moon Transit Effect: చంద్ర గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా మెరుగుపడతాయి.
Moon Transit Effect On Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో చంద్ర గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. అలాగే ఈ గ్రహాన్ని శాంతి, ఆనందం, సంపదకు సూచికగా భావిస్తారు. జాతకంలో ఈ గ్రహం శుభస్థానంలో ఉంటే అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా మానసిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలాగే ఇవేకాకుండా ఇతర ప్రయోజనాలు కలుగుతాయి.
చంద్రుడు సొంత రాశిలోకి ప్రవేశించబోతోంది. కర్కాటక రాశిలోకి చంద్రుడు ప్రవేశించబోతున్నాడు. దీనికి ఈ కింది రాశులవారికి ప్రేమ, ఆనందం రెట్టింపు అవుతుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతన్నారు.
కర్కాటక రాశిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన చంద్రుడు ప్రవేశించడం వల్ల మేష రాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న పనులు కూడా పరిష్కారమవుతాయి. ఉద్యోగాలు చేసేవారు కొత్త ఇండ్లు కూడా కొనుగోలు చేస్తారు.
మేష రాశివారికి ఉద్యోగ జీవితం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో చిక్కుకున్న డబ్బులు కూడా తిరిగి వస్తాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. వ్యాపారాలు చేసేవారు కూడా అధిక మొత్తంలో లాభాలు పొందుతారు. కుటుంబ జీవితంలో కూడా సంతోషం కూడా రెట్టింపు అవుతుంది.
కర్కాటక రాశి వారికి కూడా చంద్రుడి అనుగ్రహం లభించి.. ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారాలు కూడా సక్రమంగా సాగుతాయి. అంతేకాకుండా ఇతర పెద్ద కంపెనీల ఒప్పందాలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు.
గతంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతకాకుండా కోర్టు కేసులు కూడా గెలుస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా భారీ మొత్తంలో తిరిగి వస్తాయి.
సింహ రాశివారికి చంద్రుడి అనుగ్రహం వల్ల ఊహించని విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా సమాజంలో గౌరవం కూడా పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేసేవారికి సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి.