Manipur: మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా.. కారణం ఏంటంటే..?

Biren singh resigns: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 9, 2025, 07:20 PM IST
  • మణిపూర్ సీఎం సంచలన నిర్ణయం..
  • పదవికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన..
Manipur: మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా.. కారణం ఏంటంటే..?

Manipur cm biren singh resigns: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం తన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ అజయ్ భల్లాతో సమావేశం అయ్యారు. ఈ మేరకు గత రెండేళ్లుగా మణిపూర్ లో విపరీతమైన అల్లర్లు చోటు చేసుకుంటున్న విషయం తెలసిందే.

ఈమేరకు పలు మార్లు శాంతి భద్రతల సమస్యకూడా తలెత్తింది. ఈ మేరకు దీనిపై నైతిక బాధ్యత వహిస్తు తన పదవికి సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా తన రాజీనామా పత్రాన్ని ఇంఫాల్ లో ఉన్న గవర్నర్ అజయ్ భల్లాకు స్వయంగా అందించారు. ఈ ఘటన ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మణిపూర్ లో కొన్నేళ్లుగా జాతుల మధ్య  గొడవలతో రాష్ట్రం అట్టుడుకుతుంది.

సొంత పార్టీ నేతల నుంచి సైతం బీరెన్ సింగ్ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. మరోవైపు అపోసిషన్ పార్టీ కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేష పెట్టేందుకు సిద్దమైంది.  ఈ నేపథ్యంలో బీరెన్ సింగ్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, హోమంత్రి అమిత్ షా లతో ఈ రోజు భేటీ అయ్యారు.

ఆ తర్వాత అనూహ్యంగా సాయంత్రం గవర్నర్ అజయ్ భల్లాను కలిసి తన రాజీనామాను అందజేశారు. ఇప్పటి వరకు ఈ అల్లర్లలో దాదాపు.. 250 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తొంది. మణిపూర్ అల్లర్ల వెనుకాల బీరెన్ సింగ్ హస్తముందని  అనేక వీడియోలు లీక్ అయ్యాయి.

Read more: Delhi CM Race: ఢిల్లీ సీఎం రేసులో ఐదుగురు ? హస్తిన సింహాసనం దక్కేది ఎవరికంటే..

ఈ ఘటన సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఫోరెన్సీక్ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీరేన్ సింగ్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News