PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ నిధుల మంజూరుకు తేదీ ఖరారు, ఎప్పుడంటే?

Pm Kisan 19th Installment: కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తోన్న పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధిపై అప్డేట్‌ వచ్చింది. రైతులు 19వ విడుత పీఎం కిసాన్‌ నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఏడాదిలో మూడు విడుతల్లో పీఎం కిసాన్‌ రూ.2000 చొప్పున మొత్తం రూ.6000 కేంద్రం రైతుల ఖాతాల్లో డీబీటీ ద్వారా అందజేస్తుంది. అయితే, ఇప్పటి వరకు 18 విడుతలు పీఎం కిసాన్‌ నిధులు విడుదల అయ్యాయి. 
 

1 /5

పీఎం కిసాన్‌ నిధులు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. చిన్నా సన్నకారు రైతులకు వ్యవసాయ పెట్టుబడులకు ఈ పథకం కేంద్రం 2019 లో ప్రారంభించింది. ఇలా ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లో రూ.6000 డైరెక్ట్ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (DBT) ద్వారా అందజేస్తుంది.  

2 /5

మొన్నటి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం సాయం రూ.10000 పెంచుతారని రైతులు ఎదురు చూశారు. కానీ, కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఇప్పటి వరకు మన దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. 2024 అక్టోబర్‌ 5వ తేదీ 18వ విడుత నిధులు మంజూరు చేశారు.  

3 /5

19వ విడుత నిధుల మంజూరుకు రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలె కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై మాట్లాడారు.. ఫిబ్రవరి 24వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్‌ వెళ్లనున్నారు. ఆరోజు ఖాతాల్లో పీఎం కిసాన్‌ నిధులు జమా చేస్తారని చెప్పారు.  

4 /5

అయితే, ఈ పథకం లబ్ది పొందాలంటే పీఎం కిసాన్‌ పోర్టల్‌లో కేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి. ఇది ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. pmkisan.gov.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి మీ వద్ద సరైన పత్రాలు కూడా ఉండాలి. ఆధార్‌ కార్డు బ్యాంకు ఖాతాకు లింక్‌ అయి ఉండాలి. భూ రికార్డులు, రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ కూడా ఉండాలి.  

5 /5

మీ గ్రామంలో ఉండే కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ (CSC)లలో కూడా ఈ కేవైసీ పూర్తి చేస్తారు. అంతేకాదు పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా లబ్దిదారుల స్టేటస్‌ చెక్‌ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. కుటుంబంలో కేవలం ఒక్కరికి మాత్రమే పీఎం కిసాన్‌ నిధులకు అర్హులు అవుతారు.