Acharya Ng Ranga Agricultural University Jobs Notification 2025: ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్. ఇటీవలే వచ్చిన కొత్త ప్రాజెక్ట్‌లో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేశారు.
Acharya Ng Ranga Agricultural University Jobs Notification: నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి ఉద్యోగల భర్తీ నోటిఫికేషన్ విడుదలైంది. అనకాపల్లితో పాటు తిరుపతిలో ఉన్న రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్స్ ఇటీవలే ప్రకటించిన ఓ ప్రాజెక్ట్‌లో భాగంగా రీసెర్చ్‌కి సంబంధించిన అసోసియేట్ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయబోతున్నట్లు ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు, అప్లికేషన్ విధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి సంబంధించిన స్పెషల్ రీజనల్ రీసెర్చ్ కోసం చేపట్టిన “Gramin Krishi Mausam Sewa” అనే ప్రాజెక్టులో భాగంగా ఈ ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించిన రెండు నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి.
రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో వెల్లడించారు. అయితే ఈ ఉద్యోగాలను కేవలం 11 నెలలకు మాత్రమే భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. అభ్యర్థులను స్వయంగా ఇంటర్వ్యూలకు పిలిచి.. ఎంపిక చేయబోతున్నట్లు తెలిపారు.
ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన లోకేషన్ వివరాల్లోకి వెళితే.. ఎంపికైన అభ్యర్థులు తప్పకుండా అనకాపల్లి, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో మొత్తం ఉద్యోగాల సంఖ్య 02 కాగా.. వీటిని భర్తీ చేస్తున్నట్లు ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు తెలపారు.
అలాగే ఈ నోటిఫికేషన్ విద్యార్హతలన కూడా కూడా వెల్లడించారు. ఈ “Gramin Krishi Mausam Sewa” అనే ప్రాజెక్ట్ లో రీసెర్చ్ అసోసియేట్‌గా పని చేయాలనుకునేవారు తప్పకుండా అగ్రికల్చరల్ Ph.D పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదా అగ్రోమిటీయోరాలజీ అర్హతను కలిగి ఉండాలని నోటిఫికేషన్లో తెలిపారు.
అంతేకాకుండా ఈ ఉద్యోగాల్లో పనులు చేసేవారికి ప్రత్యేకమైన అనుభవం కూడా ఉండాలని నోటిఫికేషన్లో క్లుప్తంగా వెల్లడించారు. పరిశోధన రంగంలో తప్పకుండా మూడేళ్ల అనుభం ఉండాలని పేర్కొన్నారు. అంతేకాకుండా జీతాల వివరాలను కూడా ఇందులో తెలిపారు..
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ. 58,000తో పాటు HRA జీతం చెల్లించనున్నారు. ఇక Ph.D విద్యార్హత ఉన్నవారికి మాత్రం ప్రత్యేకంగా రూ.67,000తో పాటు HRA అందించబోతున్నట్లు తెలిపారు. ఎంపిక వివరాల్లోకి వెళితే.. ఇంటర్వ్యూలు నిర్వహించి ఈ ఉద్యోగాలను అందించబోతున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు.