PriyanKa Jain: కుంభమేళలో ప్రియాంక జైన్.. ప్రియుడితో కలిసి అక్కడ కూడా పాడుపనులు.. పిక్స్ వైరల్..

Maha kumbh mela: ప్రయాగ్ రాజ్  మహా కుంభమేళలో ప్రియాంక జైన్ ఫోటోలు దిగుతూ, ప్రియుడితో రీల్స్ చేస్తు రచ్చ చేసింది. ఈ క్రమంలో మరోసారి ఈ వయ్యారీని నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.
 

1 /6

ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న కుంభమేళలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళ కావడంతో భక్తులు భారీగా పొటెత్తుతున్నారు. అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు త్రివేణి సంగమానికి వస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారను.

2 /6

ఇటీవల భూటాన్ రాజు కూడా కుంభమేళకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. మన దేశ ప్రధాని మోదీ సైతం కుంభమేళకు వెళ్లి పవిత్రమైన త్రివేణి సంగమంలో స్నానం చేశారు. ఇప్పటి వరకు దాదాపుగా.. 39 కోట్ల మంది కుంభమేళకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు ఇంకా భక్తులు వస్తునే ఉన్నారు.  

3 /6

అయితే.. కుంభమేళలో ఇటీవల సెలబ్రీటీలు కూడా సందడి చేస్తున్నారు.  ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన వారిలో ఇప్పటికే సంయుక్త మీనన్, బిందు మాధవి, యాంకర్ లాస్య, శ్రీనిధి శెట్టి, పవిత్ర గౌడ , పూనమ్ పాండే వంటి ప్రముఖులు కుంభమేళాకు వచ్చి పవిత్రమైన స్నానాలు ఆచరించారు. ఈ క్రమంలో బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ కూడా కుంభమేళకు వచ్చారు. 

4 /6

ఆమె తన ప్రియుడు శివతో కలిసి కుంభమేళకు వచ్చారు. అయితే అక్కడ కూడా రీల్స్ చేస్తు, ఫోటో షూట్ చేస్తు రచ్చ చేశారు. అదేదో గోవాకో, మాల్దీవులకు వెళ్లినట్లు వాళ్లు ప్రవర్తించారు. వీరి ఫోటోషూట్ ను నెటిజన్లు తీవ్రంగా మండి పడుతున్నారు. పవిత్రమైన ప్రదేశాలకు వెళ్లి ఇలాంటి పనులు ఏంటని కూడా ఏకీ పారేస్తున్నారు.  

5 /6

ప్రియాంక జైన్ గతంలో తిరుమలలో కూడా రీల్స్ చేస్తు అడ్డంగా బుక్కైంది. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. చివరకు దిగొచ్చి తిరుమలలో తాము చేసింది తప్పే అని కూడా సారీ చెబుతు ఒక వీడియో సైతం రిలీజ్ చేశారు. అది మరవక ముందే మళ్లీ కుంభమేళలో అచ్చం అలాగే ప్రవర్తించారు.

6 /6

ప్రస్తుతం ప్రియాంక జైన్ తన కుంభమేళ , కాశీయాత్రల ఫోటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం వైరల్ గా మారాయి. అయితే.. దీనిపై నెటిజన్లు మాత్రం తమదైన స్టైల్ లో తిట్టిపోస్తున్నారు. కుంభమేళకు వెళ్లింది పవిత్రస్నానాలు చేయడానికా.. లేదా ఫోటోషూట్ల  కోసమా.. అంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో మరోసారి ప్రియాంక జైన్ వార్తలలో నిలిచింది.