Mega Job Mela 2025: తెలంగాణ రాష్ట్ర యువతకు అద్భుతమైన గుడ్ న్యూస్.. ఈనెల 5వ తేదీన నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని వేయికి పైగా ఉద్యోగాలతో కూడిన మెగా జాబ్ మేళాను నిర్వహించబోతున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఈ జాబ్ మేళాలో భాగంగా తెలంగాణలోని అన్ని జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు హాజరు కావచ్చు అని పేర్కొంది అలాగే ఉద్యోగాన్ని పొందేందుకు కావలసిన అర్హతలను కూడా వెల్లడించారు. ఈ జాబ్ లకి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ తెలంగాణ రాష్ట్రంలోని జరగబోయే మెగా జాబ్ మేళా నాగర్ కర్నూలు జిల్లాలోని కొండనాగుల పల్లెలో ఉండే శ్రీ ఉమామహేశ్వర ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కాలేజ్ కి సంబంధించిన ప్రిన్సిపాల్ కూడా ఈ జాబ్ మేళా సంబంధించిన ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.
ఈ జాబ్ మేళాలో భాగంగా ఫాక్స్‌కాన్ కంపెనీ నుంచి వివిధ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఇందులో పాల్గొనబోతున్నట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఇందులో పాల్గొని గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాలేజీ ప్రిన్సిపల్ రవి తెలిపారు.
ఇక ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హత వివరాల్లోకి వెళితే.. వివిధ కంపెనీలు చిన్నస్థాయి నుంచి పెద్ద స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి పదో తరగతి నుంచి డిగ్రీ డిస్ కంటిన్యూ అయినవారికి కూడా జాబ్స్‌ను అందించబోతున్నట్లు సమాచారం.
ఈ జాబ్ మేళా ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కాబోతున్నట్లు కాలేజ్ ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఇందులో పాల్గొనే అభ్యర్థులు తప్పకుండా పాన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఫోటోలు, సర్టిఫికెట్స్ కు సంబంధించిన జిరాక్స్ కాపీలను వెంట తెచ్చుకోవాలని ప్రిన్సిపాల్ తెలిపారు.
ఇప్పటికే ఈ జాబ్ మేళాకు సంబంధించిన ప్రత్యేకమైన ఏర్పాట్లను కాలేజీ యాజమాన్యం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఏవైనా సందేహాలు ఉంటే 9010604235 మొబైల్ నెంబర్ ద్వారా కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.