Balakrishna Favourite Heroine: నందమూరి బాలకృష్ణ తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఇటీవల, ఓ ప్రత్యేక సందర్భంలో బాలయ్య తన అభిమాన హీరోయిన్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బాలయ్య ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరో తెలిసి అభిమానులు షాక్ కి గురవుతున్నారు
నందమూరి బాలకృష్ణ, పద్మభూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. 14 ఏళ్ల వయసులో 'తాతమ్మ కల' ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన బాలయ్య, తన నటనా ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'సాహసమే జీవితం' చిత్రంతో హీరోగా మారి, అనేక హిట్ సినిమాలు అందించారు. తన డైలాగ్ డెలివరీ, మాస్ అప్పీల్, యాక్షన్ సీన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు.
పద్మభూషణ్ గెలుచుకున్న సందర్భంగా, బాలయ్య కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో భువనేశ్వరి, బాలయ్యను తన ఫేవరేట్ హీరోయిన్ ఎవరో చెప్పమని ప్రశ్నించారు. మొదట తాను తన భార్య వసుంధర అని చెప్పిన బాలయ్య, ఆ తర్వాత తన ఫేవరేట్ హీరోయిన్స్ గురించి వెల్లడించారు. తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో స్టార్ హీరోయిన్లతో కలిసి నటించిన బాలకృష్ణ, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరేట్ హీరోయిన్ల గురించి వెల్లడించారు. మరి ఆ ముగ్గురు ఎవరు ఒకసారి చూద్దాం..
విజయశాంతి – బాలకృష్ణ, విజయశాంతి జోడిగా వచ్చిన సినిమాలు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాయి. 'కథానాయకుడు', 'పట్టాభిషేకం', 'భానుమతి గారి మొగుడు', 'ముద్దుల మావయ్య' వంటి హిట్ చిత్రాలు వీరి కాంబినేషన్లో ఉన్నాయి.
రమ్యకృష్ణ – బాలయ్యతో రమ్యకృష్ణ నటించిన సినిమాలు తక్కువే అయినప్పటికీ.. ఈ కాంబో అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక ఈ హీరోయిన్ పేరు కూడా బాలయ్య చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సిమ్రాన్ – 90వ దశకంలో బాలకృష్ణ, సిమ్రాన్ కలిసి పలు హిట్ చిత్రాల్లో నటించారు. వీరి కాంబినేషన్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్లాక్ బస్టర్లు వచ్చి అందరినీ ఆకట్టుకున్నాయి.
కాగా బాలయ్య సినిమాల విషయానికి వస్తే..సంక్రాంతి కానుకగా విడుదలైన 'డాకు మహారాజ్' భారీ విజయాన్ని సాధించి, బాలకృష్ణ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. వరుసగా విజయం సాధిస్తూ టాలీవుడ్లో తన స్థాయిని నిలుపుకుంటున్నారు.