Balakrishna మద్యం.. భార్య.. ఏందయ్యా బాలయ్య ఈ మాటలు..!

Balakrishna controversy: నందమూరి బాలకృష్ణ గురించి ఇటీవల జరిగిన ఒక సంఘటనలో, ఆయన మధ్యం, భార్యపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాయి. అయితే, ఈ మాటలు సరదాగా చెప్పినట్లు బాలయ్యనే చెప్పారు. ఇంతకీ అసలు బాలయ్య ఏమన్నారో ఒకసారి చూద్దాం..

1 /5

కొత్త సంవత్సరంలో నందమూరి బాలకృష్ణకి అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయి. సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత, ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా అఖండ 2 షూటింగ్ కూడా మొదలైంది.

2 /5

పద్మ భూషణ్ అవార్డు రావడంతో బాలయ్య సోదరి నారా భువనేశ్వరి, సీఎం చంద్రబాబుల భార్య, గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంలో, భువనేశ్వరి బాలయ్యపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.  

3 /5

భువనేశ్వరి మాట్లాడుతూ, "నీకు, మ్యాన్షన్ హౌస్ కి సంబంధం ఏంటి? వసుంధర కంటే నీకు మ్యాన్షన్ హౌస్ ఎక్కువ..? ఎప్పుడు చూసినా చంకలో పుట్టుకుని తిరుగుతుంటావు!" అని అన్నారు. భువనేశ్వరి ఈ వ్యాఖ్యలు సరదాగా చేసినప్పటికీ, ఇది ఎక్కువ మందిని ఆశ్చర్యపరిచింది.

4 /5

ఇక, బాలయ్య ఈ ప్రశ్నకు స్పందించారు. "నా జీవితంలో అన్నీ అనుకోకుండా జరిగాయి. మ్యాన్షన్ హౌస్ అలవాటు కూడా అలానే. మ్యాన్షన్ హౌస్ నన్ను ప్రేమించింది. అది, వసుంధర, ఇద్దరూ నాకు రెండు కళ్ళు!" అని పేర్కొన్నారు. 

5 /5

ఈ సమాధానం వినడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. బాలకృష్ణ చాలా సరదాగా ఈ సమాధానం చెప్పడంతో.. ఆయన అభిమానులు కూడా మరింత సరదాగా.. ఏందయ్యా బాలయ్య ఇలా చెప్పేసావు.. 'భార్యా..మద్యం నా కళ్ళు అన్నావు,' ఇంటికెళ్లాక మీ వైఫ్ ఏమంటుందో అంటూ మరింత చతురతగా కామెంట్స్ పెడుతున్నారు.