Samantha About Her EX: సమంత తన మాజీలు వైవాహిక బంధంలో సంతోషంగా ఉండడం చూసి అసూయ పడుతోంది అని వార్తలు రావడంతో.. వాటిపై స్పందించింది ఈ హీరోయిన్. నాగచైతన్య తో గతంలో సమంత విడాకుల తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
టాలీవుడ్ హీరోయిన్ సమంత నిరంతరం.. ఏదో ఒక విషయంలో ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా సినిమాల విషయం కంటే ఎఫైర్స్, పలు రకాల రూమర్స్ వల్లే సమంత పేరు గట్టిగా వినిపిస్తోంది. సమంత వివాహం, విడాకులు, లవ్ రూమర్స్ నుంచి బయటపడిన తర్వాత తన ప్రయాణం చాలా మారిపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన విషయాలపై అలాగే తన మాజీల బంధాలపైన పలు వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా సమంత తన మాజీలు ప్రస్తుతం వైవాహిక బంధంతో చాలా ఆనందంగా ఉండడంతో, సమంత అసూయ పడుతోందనే విధంగా వార్తలు రావడం పైన యాంకర్ ప్రశ్నించగా.. అందుకు సమంతా మాట్లాడుతూ.. తన జీవితంలో ఒకప్పుడు ఉండి, ఇప్పుడు విడిపోయిన వారు ఆనందంగా ఉండడంతో సమంత అసూయగా ఉందనే విషయం కేవలం అలా అనుకునే వారి యొక్క అజ్ఞానమే అంటూ తెలియజేసింది. అసూయ అనే పదానికి తాను ఎప్పుడూ కూడా దూరంగానే ఉంటానని విషయాన్ని తెలియజేసింది.
అలాగే తన జీవితంలో ఎన్నో కష్టాలను కూడా అనుభవించానని.. అయినా కూడా ఆ కష్టాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని తెలిపింది. కానీ తనకు వివాహమై విడాకులు తీసుకున్న తర్వాత చాలామంది తనను సెకండ్ హ్యాండ్ అంటూ చాలా అసభ్యకరంగా కామెంట్స్ చేసే వారని తెలిపింది సమంత మొత్తానికైతే సమంత చేసిన ఏ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి
ఇక సమంత మాజీల విషయానికి వస్తే ప్రముఖ నటుడు సిద్ధార్థ తో ఈమె ప్రేమలో మునిగితేరింది పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ విడిపోయారు ఇక సిద్ధార్థ కూడా తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఇప్పుడు అతిధి రామ్ హైదరీతో ఏడడుగులు వేసి వైవాహిక బంధం లో సంతోషంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే
మరొకరు సమంత మాజీ భర్త నాగచైతన్య.. ఇతడిని ఏడేళ్లు ప్రేమించింది. వైవాహిక బంధంలో నాలుగేళ్లు గడిపింది. కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల ఇద్దరూ విడిపోయారు. నాగచైతన్య శోభిత దూళిపాళన వివాహం చేసుకొని వైవాహిక బంధంలో సంతోషంగా కొనసాగుతున్నారు.