Maha Kumbh 2025: కుంభమేళలో భూటాన్ రాజు.. యోగితో కలిసి గంగా హరతి, పవిత్ర స్నానం.. పిక్స్ వైరల్..

Bhutan King in kumbh mela: కుంభమేళలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యాల్ వాంగ్చుక్ పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి, గంగా హారతి కార్యక్రమంలో సైతం పాల్గొన్నారు.
 

1 /6

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళ ఉత్సవానికి మనదేశం నుంచి మాత్రమే కాకుండా.. విదేశాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో..144 సంవత్సరాల తర్వాత వచ్చిన మహాకుంభమేళ కావడంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. జన్వరి 13న ప్రారంభమైన మహా కుంభమేళ ఫిబ్రవరి 26తో ముగియనుంది.

2 /6

 ఇప్పటి వరకు కుంభమేళలో దాదాపుగా.. 35 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో తాజాగా.. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యాల్ వాంగ్చుక్ కూడా ప్రయాగ్ రాజ్ వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. అంతకు ముందు  ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ భూటాన్ రాజుకు ప్రత్యేకంగా స్వాగతం పలికారు.   

3 /6

సోమవారం రోజు లక్నో చేరుకున్న భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యాల్ వాంగ్చుక్ కు పుష్పగుచ్చం ఇచ్చి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇది రెండు దేశాల మధ్య మంచి మైత్రి సంబంధ పరిణామమని చెప్పుకొవచ్చు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈరోజు ప్రత్యేకంగా భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యాల్ వాంగ్చుక్ ను త్రివేణి సంగమంకు తీసుకెళ్లారు.   

4 /6

 పవిత్ర స్నానాలు చేయడంతో పాటు, గంగాహారతిలో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం భూటాన్ రాజు పుణ్యస్నానాలు ఆచరించడం, గంగా హారతికి చెందిన పిక్స్, వీడియో లు వైరల్ గా మారాయి. దీన్ని బట్టి చూస్తే మహాకుంభమేళ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొవచ్చు. ఇప్పటికే ఎంతో మంది ఫారెనర్స్ వచ్చి కుంభమేళలను దర్శించుకున్నారు. 

5 /6

ఇంకా రెండు షాహీ స్నానాలు మిగిలి ఉన్నాయి. మాఘి పూర్ణిమ ఫిబ్రవరి 12, మహాశివరాత్రి ఫిబ్రవరి 26. ఈ రోజుల భక్తులు భారీగా వస్తారని చెప్పుకొవచ్చు. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసిన కూడా కుంభమేళ గురించే మాట్లాడుకుంటున్నారు. యూపీ యోగి ఆదిత్యనాథ్ సర్కారు సైతం కుంభమేళలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు.

6 /6

కుంభమేళ ముగిసే వరకు కూడా  అనేక మంది అధికారుల్ని ప్రత్యేకంగా యోగి సర్కారు నియమించింది. ఇటీవల మౌనీ అమావాస్య నేపథ్యంలో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా యూపీ ప్రభుత్వం కుంభమేళలో పటిష్టమైన చర్యలు తీసుకుంది.