Sreeleela: తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో ప్రతిభావంతమైన హీరోయిన్లు ఉన్నారు. ప్రస్తుతానికి టాప్ హీరోయిన్గా ఒక్కరి పేరు మాత్రమే నిర్ణయించడం కష్టమే. ప్రతి హీరోయిన్స్‌లో వేర్వేరు ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే, నేటి హీరోలతో సమానంగా డ్యాన్స్‌లు చేయగలిగిన హీరోయిన్స్‌లో.. మాత్రం శ్రీలీల పేరు ముందుంటుంది.
ప్రస్తుతం ఎంతోమంది తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. అయితే వీళ్ళల్లో ఎక్కువ అవకాశాలు అందుకుంటూ ముందుకు వెళ్తున్న హీరోయిన్ మాత్రం శ్రీలీల. త్వరలోనే తమిళంలో కూడా అరుగుపెట్టనుండి ఈ హీరోయిన్.
గత రెండు సంవత్సరాల్లో శ్రీలీల చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కూడా పరవాలేదు అనిపించుకున్నాయి. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందD అనే సినిమా ద్వారా శ్రీలీల హీరోయిన్గా పరిచయమైంది. ఈ సినిమాలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా కనిపించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అనంతరం, శ్రీలీల రవితేజతో ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా ll బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది.
ధమాకా సినిమా తరువాత, శ్రీలీలకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఆమె స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం, ఎక్స్ట్రా-ఆర్డినరీ మ్యాన్ వంటి చిత్రాలలో నటించింది. అలాగే, పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ నూతన సినిమాలో కూడా ఛాన్స్ కొట్టింది. తెలుగు పరిశ్రమలో బిజీ హీరోయిన్గా మారిన శ్రీలీల, తమిళ చిత్ర పరిశ్రమలో కూడా పరాశక్తి సినిమా ద్వారా తన ప్రతిభ చూపించనుంది.
ఇప్క శ్రీలీల బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. సైఫ్ అలీఖాన్ కొడుకైన ఇబ్రహిం ఖాన్ దిలర్ సినిమాతో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు హిట్ అయితే, శ్రీలీల కెరీర్ మరింత స్ట్రాంగ్ మారనుంది.
ఈ క్రమ ఈ మధ్య శ్రీలీల చేసిన ఒక మంచి పని అందరినీ ఆకట్టుకుంది. ఆమె ఒక అనాథాశ్రమాన్ని సందర్శించింది. అక్కడ పిల్లలు పడుతున్న కష్టాలను చూసి ఆమె చాలా బాధపడింది. అంతేకాదు అక్కడ ఆమె గొప్ప పని కూడా చేసి వచ్చింది. అదేమిటంటే అక్కడ ఉన్న ఇద్దరు ప్రతిభావంతులైన పిల్లలను – గురు, శోభిత – దత్తత తీసుకుని వారికి మంచి జీవితాన్ని అందించడానికి సాయపడింది. ఈ విషయం తెలిసిన తరువాత, ఆమెపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇలా ఇంత చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని వారి బాగోకలు చూసుకుంటానని చెప్పడంతో అందరూ శ్రీలీలనే తెగ ప్రశంసిస్తున్నారు. మొత్తం మీద ఇలా పెళ్లి కాకుండానే.. తన పెద్ద మనసుతో ఇద్దరు పిల్లలకు తలైంది శ్రీల.