Tata Harrier EV Price: టాటా నుంచి బిగ్‌ అప్డేట్‌.. 500కిలో మీటర్ల మైలేజీతో Tata Harrier EV కారు వచ్చేస్తోంది..

Tata Harrier EV Price In Hyderabad: త్వరలో ఎంతో శక్తివంతమైన టాటా హారియర్ EV (Tata Harrier Ev) కారు లాంచ్‌ కాబోతోంది. ఇది దాదాపు 500 కిలో మీటర్ల మైలేజీ రేంజ్‌తో విడుదల కానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను టాటా కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది. 

Tata Harrier EV Price In Hyderabad: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ  టాటా మోటార్స్ భారత కస్టమర్స్‌కి త్వరలోనే శుభవార్త తెలపబోతోంది. అద్భుతమైన మరో ఈవీ కారును లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్‌ విపరీతంగా పెరుగతూ వస్తోంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే మరో EV కారును లాంచ్‌ చేసేందుకు టాటా కంపెనీ సిద్ధమైంది. అయితే ఈ కొత్త EV కారుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
 

1 /5

గతంలో మార్కెట్‌లోకి విడుదలైన టాటా హారియర్ కారు త్వరలనే ఎలక్ట్రిక్‌ వేరియంట్‌లో విడుదల కానుంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా గతంలో టాటా కంపెనీ విడుదల చేసిన ఎలక్ట్రిక్‌ కార్ల కంటే ఎక్కువ మైలేజీతో అందుబాటులోకి రానుంది.   

2 /5

టాటా హారియర్ EV ఎలక్ట్రిక్ (Tata Harrier Ev) కారు ప్రీమియం ఇంటీరియర్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా 500 కిలోమీటర్ల పైగా మైలేజీతో విడుదల కానుంది. అలాగే అద్భుతమైన డిజైన్‌తో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టాటా కంపెనీ ఈ కారుకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించనుంది.  

3 /5

టాటా హారియర్ EV కారు లోపలి భాగంలో అద్భుతమైన ఇంటీరియర్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ కారులో అద్భుతమైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అలాగే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా లభించబోతున్నట్లు తెలుస్తోంది.  

4 /5

ఈ కారులో టాటా కంపెనీ అద్భుతమైన కనెక్టివిటీలను అందిస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు 360-డిగ్రీ కెమెరాను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్కింగ్ సెన్సార్లతో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ను కూడా అందిస్తోంది.  

5 /5

ఈ టాటా హారియర్ EV కారు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సెటప్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఈ కారు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారు టాటా కంపెనీ ఏప్రిల్ నెలలో విడుదల చేసే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ.20 లక్షల నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్‌ ఉంది.