Nagarjun About Nayanthara Struggles : ప్రముఖ హీరోయిన్ నయనతార సినిమా షూటింగ్ సెట్లో ఉన్నప్పుడు తన బాయ్ ఫ్రెండ్ ఆమెను చాలా దారుణంగా హరాస్ చేశాడని, ఈ విషయాన్ని నాగార్జున తెలిపారు. వీరిద్దరూ కలిసి పరి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. మరి నాగార్జున.. నయనతార గురించి.. తన బాయ్ ఫ్రెండ్ గురించి ఏం చెప్పారంటే..?
సౌత్ ఇండస్ట్రీలోని లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార గురించి చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ గా కంటే ముఖ్యంగా ఎఫైర్స్ వల్లే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో వివాహమైన తర్వాత కొంతమేరకు ఈమె గురించి పలు రకాల రూమర్స్ అయితే వినిపించలేదు.
ఇకపోతే నయనతార ఈ స్థాయిలోకి రావడానికి చాలా కష్టపడింది. ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార, ఎన్నో అవమానాలను తన కెరియర్లో ఎదుర్కొంది. ముఖ్యంగా నయనతారను ఒక స్టార్ హీరో ప్రేమ పేరుతో దారుణంగా హింసించే వారని, దీనివల్ల నయనతార కూడా చాలా ఇబ్బందులు పడిందనే విషయం చాలామందికి తెలిసిందే.
అయితే ఈ విషయాన్ని హీరో నాగార్జున కూడా కళ్ళారా చూశాను అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. నయనతార గతంలో కూడా చాలామంది హీరోలతో ప్రేమలో పడింది. ముఖ్యంగా కోలీవుడ్ హీరో శింబు తో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోవడం కూడా జరిగింది.
ఆ సమయంలోనే నటుడు ప్రభుదేవాతో పరిచయం ఏర్పడగా, అతడితోనే ప్రేమలో పడింది. చివరికి ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇచ్చి నయనతారని వివాహం చేసుకుంటారని వార్తలు కూడా వినిపించాయి. కానీ ఆ తర్వాత ప్రభుదేవా టార్చర్ ని తట్టుకోలేక నయనతార విడిపోయినట్లు వార్తలు వినిపించాయి. ఒకానొక సమయంలో నాగార్జునతో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నయనతార తన లవర్ నుంచి చాలా ఇబ్బందులను, వేధింపులను ఎదుర్కొన్నదట.. ఆ సమయంలో నయనతార ఏడ్వడం నాగార్జున కూడా చూశారట. అయినప్పటికీ కూడా అంతటి బాధను దిగమింగుకొని మరీ సినిమా షూటింగ్లో ఆ బాధను కనిపించకుండా యాక్టింగ్ చేసిందని నాగార్జున తెలియజేశారు.
ఏది ఏమైనా ఇండస్ట్రీలోకి ఎవరి సహాయం లేకుండా వచ్చి తన నటనతో ఈ స్థాయికి ఎదిగిన నయనతారను చూసి ఇప్పటికీ కొంతమంది ఓర్వలేని వ్యక్తులు ఉన్నారని అభిమానుల సైతం కామెంట్లు చేస్తూ ఉంటారు.