Rashmika Mandanna: ప్రతిసారి నేను ఏడుస్తాను.. మరోసారి వీల్ చైర్ పై వచ్చి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చిన రష్మిక..!

Vicky Kaushal Chhava: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం పాన్ ఇండియాపరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో సెన్సేషనల్ క్రియేట్ చేసిన ఈ హీరోయిన్ పలు హిందీ ప్రాజెక్టులు అందుకుంటూ నార్త్ లో కూడా తన సత్తా చూపుతోంది. త్వరలోనే ఈ హీరోయిన్ నటించిన ‘ఛావా’ సినిమా హిందీతో పాటు సౌత్ భాషల్లో కూడా విడుదల కానుంది. 

1 /5

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత విజయవంతమైన దశను చవిచూస్తోంది. ఇటీవల యానిమల్, పుష్ప 2 సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం పలు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్‌తో కలిసి ‘ఛావా’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది ఈ ముద్దుగుమ్మ.  

2 /5

లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛావా’ చిత్రంలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. దినేష్ విజన్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్లు వేగం పెంచాయి. ఇందులో భాగంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించింది.  హైదరాబాద్‌లో జరిగిన ఈ ప్రమోషనల్ ఈవెంట్‌లో విక్కీ కౌశల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా స్వయంగా తెలుగులో మాట్లాడి అందరి హృదయాలను గెలుచుకున్నాడు.  

3 /5

విక్కీ కౌశల్ మాట్లాడుతూ, “‘ఛావా’ కోసం శారీరకంగా, మానసికంగా చాలానే సిద్ధమయ్యాను. యుద్ధ సన్నివేశాలు, గుర్రపు స్వారీకి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. ముఖ్యంగా ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రను చేయడం చాలా పెద్ద సవాల్. ఇది ఒక గొప్ప యోధుడి కథ. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ గారు మొదటి నుంచి నన్ను పాత్ర పేరుతోనే పిలుస్తూ వచ్చారు. ఈ సినిమా నా జీవితంలో ప్రత్యేకమైనది. సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ,” అని అన్నారు.    

4 /5

ప్రస్తుతం కాలుకి గాయంతో సతమతమవుతున్న రష్మిక ఈ ఈవెంట్ కూడా వీల్ చైర్ లో అటెండ్ అయ్యి భావోద్వేగంతో కూడిన స్పీచ్ ఇచ్చింది. రష్మిక మందన్న మాట్లాడుతూ, “‘ఛావా’ ఒక భావోద్వేగ ప్రయాణం. ఈ కథలో ప్రేమ, త్యాగం, భక్తి అంతా ఉంటుంది. ప్రతిసారి ఈ సినిమా చూస్తే నా కళ్ళలో నీరు ఆగదు. ప్రతిసారి నేను ఏడుస్తాను. విక్కీ కౌశల్ తన పాత్రలో చాలా బాగా నటించాడు . అతని పెర్ఫార్మెన్స్ మంత్రముగ్ధులను చేస్తుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం, ముఖ్యంగా ‘జానే తూ’ పాట ప్రేక్షకుల మనసులను కదిలిస్తుంది,” అని చెప్పింది.    

5 /5

‘ఛావా’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకుంది. ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఈ సినిమా తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.