AP Housing Scheme: ఏపీ ప్రభుత్వం అందరికీ ఇళ్లు పథకం ప్రకటించింది. సొంత ఇళ్లు లేనివారికి ఇంటి స్థలం మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఈ పధకం ప్రవేశపెట్టింది ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో నివసించేవారికి 2 సెంట్ల భూమి కేటాయిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ పధకానికి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, ఏయే కాగితాలుండాలనే వివరాలు మీ కోసం.
అందరికీ ఇళ్లు పధకంలో భాగంగా పట్టణాల్లో నివసించేవారికి 2 సెంట్ల భూమి మహిళ పేరుతో కేటాయిస్తారు. ఇంటి స్థలం లేదా ఇళ్లు పొందినవారికి పదేళ్ల తరువాత పూర్తి హక్కులు లభిస్తాయి. జీవితంలో ఒకసారి మాత్రమే హౌస్ సైట్ లభిస్తుంది. పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డును ఇచ్చిన ఇంటి స్థలానికి లింక్ చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూసుకోవాలి.
ఎవరు అర్హులు
ఇంటి స్థలం పొందాలంటే అన్నింటికంటే ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఎక్కడా సొంత ఇళ్లు లేదా ఇంటి స్థలం కలిగి ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ స్కీమ్‌లో ఎందులోనూ లబ్ది పొంది ఉండకూడదు. 5 ఎకరాలు దాటి మెట్ట భూమి, రెండున్నర ఎకరాలు దాటి జరీబు భూమి ఉండకూడదు.
ఏయే కాగితాలు కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి
అందరికీ ఇళ్లు పధకం కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో నేరుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ధృవీకరణ పత్రాలు కావాలి. ఆధార్ కార్డు జిరాక్స్, భార్య, భర్తల సంతకాలు, రేషన్ కార్డు జిరాక్స్, బ్యాంక్ ఎక్కౌంట్ జిరాక్స్, జాబ్ కార్డ్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు , కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి.
Also read: Butchaiah Chowdary: నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి వద్దు, ఆ పదవి చాలంటూ గోరంట్ల సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి