Teachers Transfers Rules: టీచర్ల బదిలీలు ఎలానో తెలుసా.. ఈ పాయింట్ల ఆధారంగానే నిర్ణయం

Andhra Pradesh Teachers Transfers Rules: ఏపీలో బదిలీలకు సంబంధించి చట్టంలో పాఠశాల విద్యాశాఖ మరో కీలక మార్పు చేసిన విషయం తెలిసిందే. టీచర్ల డిమాండ్ మేరకు ట్రాన్స్‌ఫర్స్ కోసం సాధారణ సంవత్సరం బదులుగా.. విద్యా సంవత్సరాన్నే ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇక నుంచి 2 నుంచి 5 విద్యా సంవత్సరాలు పూర్తిచేసుకున్న హెడ్‌మాస్టర్లు, 2 నుంచి 8 విద్యా సంవత్సరాలు పూర్తిచేసుకున్న టీచర్లు ట్రాన్స్‌ఫర్స్‌కు అర్హులు అవుతారు. అదేవిధంగా 5 ఏళ్లు దాటిన ప్రధానోపాధ్యాయులు,  8 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు తప్పనిసరి బదిలీల పరిధిలోకి వస్తారు. పాయింట్ల ఆధారంగా బదిలీలు ఉండనున్నాయి.
 

1 /5

పీఈటీ టీచర్లకు క్రీడాంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. క్రీడా పోటీల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో వారి విద్యార్థులు పాల్గొన్నారా..? అవార్థులు సాధించారా..? అనే ప్రాతిపదికన పాయింట్లు కేటాయిస్తారు.  

2 /5

నేషనల్ లెవల్‌లో పాల్గొనే స్థాయికి తీసుకువెళ్తే రెండు పాయింట్లు లభిస్తాయి. అవార్డు సాధిస్తే.. మూడు పాయింట్లు కేటాయిస్తారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను కూడా ప్రామాణికంగా తీసుకుంటారు.  

3 /5

సైన్స్ ఉపాధ్యాయులకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్లను ప్రామాణికంగా తీసుకుంటారు. విద్యార్థుల ఎన్ని ప్రాజెక్టులు ప్రద ర్శించారు? వాటికి ఎలాంటి ప్రశంస లభించింది? అనేది ఆధారంగా పాయింట్లు ఇస్తారు.  

4 /5

సోషల్ టీచర్లకు క్విజ్లు, జనరల్ నాలెడ్జ్ పోటీలను ప్రామాణికంగా చూస్తారు. హిందీ ఉపాధ్యాయులకు విద్యార్థులు మాధ్యమిక వంటి పరీక్షలు రాశారా..? వారి ప్రతిభ ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. గణిత టీచర్లకు విద్యార్థులను ఒలంపియాడ్ వంటి పోటీల్లో పాల్గొనే స్థాయికి తీసుకువెళ్లారా..? బహుమతులు ఏమైనా అందుకున్నారా..? అనే విషయాన్ని చెక్ చేస్తారు.  

5 /5

ఇంగ్లిష్ టీచర్లకు స్పెల్ బీ పోటీలు, ఇతరత్రా ఆంగ్ల సంబంధిత పోటీల ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. తెలుగు టీచర్లకు కూడా కొన్ని అంశాలను పెట్టే యోచనలో ఉన్నారు. ఇలా ప్రతి సబ్జెక్ట్‌లో పాయింట్ల ఆధారంగా బదిలీలను చేపట్టనున్నారు.