Janhvi Kapoor in news: పుష్ప2 మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ మీద అన్నిరికార్డులను తిరగరాస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం సెన్సెషన్ గా మారింది. ఈ క్రమంలో తాజాగా.. ఈ మూవీకి మ్యూజిక్ అందించిన దేవీ శ్రీ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అల్లు అర్జున్ హీరోగా పుష్ప2 మూవీ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ మూవీ రిలిజ్ కు ముందు అనేక సెన్సెషన్స్ క్రియేట్ చేసింది. మరోవైపు విడుదలయ్యాక కూడా అదే ఊపును కంటీన్యూ చేస్తుంది.
పుష్ప2 మూవీలో బన్నీనటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా గంగమ్మ తల్లి డ్యాన్స్, కిస్సిక్ పాటలు ఈ మూవీకి హైలెట్ గా నిలిచాయని చెప్పుకొవచ్చు . అయితే.. ఇటీవల ఐటెంసాంగ్ లను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.
పుష్ప1 మూవీలో సమంత.. 'ఊ అంటావా.. ఊఊ అంటావా'.. ఈ పాట ఎంత హిట్అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటలో సమంతకు ఒక రేంజ్ లో పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత పుష్ప2 లో కిస్సిక్ పాటలో శ్రీలీల ఐటెం సాంగ్ చేశారు. దీంతో ఆమె కూడా ఒక రేంజ్లో స్టార్ డమ్ సంపాదించారు.
ఎక్కడ చూసిన శ్రీలీలను ప్రస్తుతం కిస్సిక్ పాప అని పిలుస్తున్నారు. అంటే ఏరెంజ్ లో ఫెమస్ అయ్యిందో దీన్ని బట్టి తెలుస్తొంది. ఇటీవల దేవీశ్రీ ప్రసాద్.. మాట్లాడుతూ.. పుష్ప3 సినిమాలో.. ఐటెం సాంగ్ కోసం.. శ్రీదేవీ బిడ్డ జాన్వీకపూర్ చేస్తే బాగుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
సమంతా రూత్ ప్రభు, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, శ్రీలీల వంటి పలువురు ప్రముఖ నటీమణులు తమ కెరీర్లో ఐటెం సాంగ్ ల తర్వాత ఒక రేంజ్ లో ఫెమస్ అయిపోయారు. ఇప్పుడు దేవర బ్యూటీ జాన్వీపాప.. మంచి ఫామ్ లో ఉన్నారు. తను పుష్ప3 లో ఐటం సాంగ్ కోసం మంచి ఎంపిక అని తన అభిప్రాయమని మ్యూజిక్ డైరెక్టర్ వ్యాఖ్యలు చేశారు. దీంతో దేవీ శ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
మరోవైపు.. దేవర బ్యూటీ ఇటీవల తన పెళ్లి, పిల్లలు, ఎక్కడ సెటిల్ అవ్వాలనే పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు తిరుమల శ్రీవారంటే ఎంతో భక్తి. పెళ్లి తర్వాత ముగ్గురు పిల్లల్ని కనాలని, తిరుమలలోపెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని, అరటి ఆకులో అన్నం తినాలని, మంచి మ్యూజిక్ వినాలని కూడా జాన్వీకపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.