Sankranthiki Vasthunnam 1st Week WW Collection: రూ. 200 కోట్ల క్లబ్బులో ‘సంక్రాంతికి వస్తున్నాం’.. దుమ్ములేపుతున్న వెంకీమామ..

Sankranthiki Vasthunnam 1st Week WW Collections: ఒక్కొసారి సినీ పరిశ్రమలో కొన్ని అద్భుతాలు జరిగిపోతుంటాయి. అలాంటి అద్భుతం వెంకటేష్ హీరోగా నటించగా.. సంక్రాంతి పండగ కానుకగా సంక్రాంతి బరిలో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా. ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం అనేకంటే సునామీ అని చెప్పాలి. తాజాగా ఈ సినిమా రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించడానికి రెడీ అవుతోంది.

 

1 /7

Sankranthiki Vasthunnam 1st Week WW Collections: తెలుగులో ఇపుడు సీనియర్ హీరోల బాక్సాఫీస్ దగ్గర దడదడ లాడిస్తున్నారు.  హీరోగా వెంకటేష్ ఖేల్ ఖతం అన్నవాళ్లకు .. ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో గట్టి సమాధానమే ఇచ్చాడు. ఫ్యామిలీస్ లో తన పట్టు ఇంకా చెక్కు చెదరలేదని మరోసారి  ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు.

2 /7

తెలుగులో వెంకటేష్ కు కుటుంబ ప్రేక్షకులతో పాటు అందరి హీరోల అభిమానులు వెంకీమామ సినిమాలను ఇష్టపడుతుంటారు. ఓ రకంగా సినీ పరిశ్రమలో అజాత శత్రువు అని చెప్పాలి. తాజాగా వెంకటేష్ సీనియర్ హీరోల్లో మరో సంచలనం రేపాడు. ఈ సినిమా నిన్నటితో వారం రోజుల పూర్తి చేసుకుంది.

3 /7

ఈ వారం రోజుల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించడంతో పాటు రూ. 120 కోట్ల షేర్ అందుకొని సంచలనం రేపింది. అంతేకాదు నాన్ ప్యాన్ ఇండియా తెలుగు సినిమాగా ఇండస్ట్రీ హిట్ గా ఉన్న ‘అల వైకుంఠపురములో’ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ను ఈ సినిమా దాటడం దాదాపు ఖాయమనే చెప్పాలి.

4 /7

మొత్తంగా నాన్ ప్యాన్ ఇండియా క్యాటగిరిలో తక్కువ బడ్జెట్ తో అతి తక్కువ సమయంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రామ్ చరణ్, శంకర్ లతో తెరకెక్కించిన ‘గేమ్ చేంజర్’తో అడ్డంగా మునిగిపోయిన దిల్ రాజును ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఆదుకుంది.

5 /7

అంతేకాదు కొన్ని ఊర్లలో మూసి ఉన్న థియేటర్స్ ను ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కోసం రీ ఓపెన్ చేసారు. కొన్ని బండ్లు కట్టుకొని ఈ సినిమా చూడటానికి వస్తున్నారు. ఈ మూవీ సోలో హీరోగా వెంకటేష్ కు ఫస్ట్  రూ. 100 కోట్ల గ్రాస్ తో పాటు రూ. 100కోట్ల షేర్ అందుకున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. 

6 /7

అంతకు ముందు ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాలు కూడా రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన అందులో వరుణ్ తేజ్ మరో హీరోగా ఉన్నాడు. కానీ సింగిల్ గా వెంకీ మామ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా  సంక్రాంతి బరిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా  మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అందుకొని లాభాల్లోకి వచ్చేసింది. మొత్తంగా టాలీవుడ్ లో వెంకటేష్, అనిల్ రావిపూడి హాట్రిక్ హిట్స్ అందుకొని సంచలనం రేపారు. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 3 మిలియన్ క్లబ్బులో ప్రవేశింనుంది.

7 /7

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విషయానికొస్తే.. ఇందులో  పెద్దగా కథ, కాకరకాయ లేకపోయినా.. తనదైన కామెడీ, స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను లాజిక్ ను పక్కన పెట్టి అనిల్ రావిపూడి తన మ్యాజిక్ ను వెండితెరపై చూపించాడు. మొత్తంగా 2025 బిగ్గెస్ట్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మాత్రమే..కాదు గత కొన్నేళ్లుగా బూజు పట్టిన రికార్డులను దుమ్ము దులిపే పనిలో పడింది. త్వరలో ఈ సినిమా రూ. 300 కోట్ల క్లబ్బులో ప్రవేశించినా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు.